Rajinder Nagar bypoll result 2022: ఈ నెల 23న దేశంలోని మూడు లోక్‌స‌భ‌, ఏడు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జ‌రిగాయి. నేడు ఉప ఎన్నిక‌ల ఫ‌లితాలు వెలువ‌డ‌నున్నాయి. ఢిల్లీలోని రాజిందర్ నగర్ ఉపఎన్నిక‌కు సంబంధించి ఇప్ప‌టివ‌ర‌కు కొన‌సాగిన ఓటింగ్ లెక్కింపు ప్ర‌కారం ఆమ్ ఆద్మీ (ఆప్‌) అధిక్యంలో కొన‌సాగుతోంది.  

Delhi bypoll results: ఢిల్లీలోని రాజిందర్ నగర్‌లో జ‌రిగిన ఉప ఎన్నిక‌క‌కు సంబంధించి ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఇప్ప‌టివ‌ర‌కు అందిన స‌మాచారం ప్ర‌కారం అధికార పార్టీ ఆమ్ ఆద్మీ (ఆప్) ముందస్తు ఆధిక్యంలో ఉంది. ఢిల్లీలోని ఐటీఐ పూసాలో రాజిందర్ నగర్ ఉప ఎన్నికల కౌంటింగ్ జరుగుతోంది. ఢిల్లీలోని రాజిందర్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఓట్ల లెక్కింపు ఆదివారం ఉదయం ప్రారంభమైంది. కౌంటింగ్ కేంద్రం వద్ద ఎన్నికల సంఘం భారీ భద్రతా ఏర్పాట్లు చేసింది. జూన్ 23న ఓటింగ్ జరిగింది. అత్యల్పంగా 43.75 శాతం ఓటింగ్ నమోదైంది. ఇప్ప‌టివ‌ర‌కు కొన‌సాగిన ఓటింగ్ ఫ‌లితాల ప్ర‌కారం ఆప్ అభ్యర్థి దుర్గేష్ పాఠక్ ముంద‌జ‌లో ఉన్నారు. బీజేపీకి చెందిన రాజేష్ భాటియా రెండో స్థానంలో ఉన్నారు. దుర్గేష్ పాఠక్ 5,629 ఓట్లతో ఆధిక్యంలో ఉండటంతో ఆప్ శిబిరంలో సంబరాలు ప్రారంభమయ్యాయి. 

ఢిల్లీలోని ఐటీఐ పూసాలో రాజిందర్ నగర్ ఉప ఎన్నికల కౌంటింగ్ కేంద్రం స్ట్రాంగ్‌రూమ్‌కు మూడంచెల భద్రతా వ్యవస్థతో రక్షణ కల్పిస్తున్నారు. ముందుగా పోస్టల్ బ్యాలెట్లను లెక్కించనున్నారు. వీవీప్యాట్ (ఓటర్ వెరిఫైడ్ పేపర్ ఆడిట్ ట్రయిల్) స్లిప్పుల లెక్కింపు కోసం ప్రత్యేక ప్రత్యేక పెట్టె ఉంటుందని తెలిపారు. ఆప్ నేత రాఘవ్ చద్దా రాజ్యసభకు ఎన్నికైన తర్వాత ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో ఈ స్థానానికి ఎన్నికలు అనివార్యమయ్యాయి. మొత్తం 43.67 శాతం పురుష ఓటర్లు, 43.86 శాతం మహిళా ఓటర్లు పోలింగ్‌కు హాజరయ్యారు. థర్డ్ జెండర్ ఓటర్ల శాతం 50 శాతంగా ఉంది.14 మంది అభ్యర్థులు బరిలో ఉన్నప్పటికీ ఆప్, బీజేపీ ప్రధాన పోటీదారులుగా ఉన్నాయి. ఆప్‌కి చెందిన దుర్గేష్ పాఠక్ బీజేపీకి చెందిన రాజేష్ భాటియాపై పోరాడుతున్నారు. కాంగ్రెస్‌ పార్టీ ప్రేమ్‌లతను బరిలో దింపింది. 2020లో కోవిడ్-19 మహమ్మారి వ్యాప్తి చెందిన తర్వాత ఢిల్లీలో జరిగిన మొదటి ఎన్నికలు ఇవే. 2017లో జరిగిన రాజౌరీ గార్డెన్ ఉపఎన్నిక (46.5 శాతం), బవానా ఉపఎన్నికల్లో 44.8 శాతం నమోదైన గణాంకాల కంటే రాజిందర్ నగర్ ఉపఎన్నిక పోలింగ్ శాతం తక్కువగా ఉంది. 2015 ఎన్నికల్లో రెండు ఢిల్లీ అసెంబ్లీ స్థానాల్లో 72, 61 శాతం పోలింగ్ నమోదైంది.

Scroll to load tweet…

కాగా, మొత్తం మూడు లోక్ సభ, ఏడు అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. మూడు లోక్‌సభ స్థానాలు- ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్, అజంగఢ్, పంజాబ్‌లోని సంగ్రూర్ స్థానాలకు లోక్‌సభ ఉప ఎన్నికలు జరిగాయి.

ఏడు అసెంబ్లీ స్థానాలు - ఉప ఎన్నిక‌లు జ‌రిగిన త్రిపురలో అత్యధికంగా నాలుగు స్థానాలు ఉన్నాయి. అవి అగర్తల, జుబరాజ్‌నగర్, సుర్మా, టౌన్ బర్దోవలి ఉన్నాయి. అసెంబ్లీ ఉపఎన్నికలు జరిగిన ఇతర నియోజకవర్గాలు ఢిల్లీలోని రాజిందర్ నగర్, జార్ఖండ్‌లోని రాంచీ జిల్లాలోని మందార్, ఆంధ్రప్రదేశ్‌లోని ఆత్మకూరులు ఉన్నాయి.