Asianet News TeluguAsianet News Telugu

ఢిల్లీ అసెంబ్లీ ఫలితాలు 2020: ఆరు జిల్లాల్లో ఆప్ హవా

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆరు జిల్లాల్లో ఆప్ దూసుకుపోయింది.కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులపై ఆప్ అభ్యర్థులు ఆధిక్యంలో ఉన్నారు. ఈ ఆరు జిల్లాల్లో  ఆప్ స్వీప్ చేసే దిశగా ఫలితాలు కన్పిస్తున్నాయి. 

DElhi assembly results 2020: AAP set to sweep in six districts in New DElhi
Author
New Delhi, First Published Feb 11, 2020, 10:03 AM IST


న్యూఢిల్లీ: న్యూఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో  ఆప్ అభ్యర్థులు దూసుకుపోతున్నారు. ఆరు జిల్లాల్లో  ఆప్ అభ్యర్థులు తమ సమీప ప్రత్యర్థుల కంటే  ముందంజలో ఉన్నారు. ఎగ్జిట్ ఫలితాలకు అనుగుణంగానే తొలిదశ ఫలితాలు కన్పిస్తున్నాయి. 

న్యూఢిల్లీ రాష్ట్ర అసెంబ్లీకి ఈ నెల 8వ తేదీన ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో 64 శాతం పోలింగ్ నమోదైంది.  న్యూఢిల్లీ, ఉత్తర ఢిల్లీ, దక్షిణ ఢిల్లీ, సెంట్రల్ ఢిల్లీ, షాహదారాతో పాటు మరో జిల్లాలో కూడ  ఆప్ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. ఐదేళ్లలో  ఢిల్లీ రాష్ట్ర ముఖ్యమంత్రిగా  అరవింద్ కేజ్రీవాల్ చేపట్టిన కార్యక్రమాలు  ఆ పార్టీని విజయపథంలోకి తీసుకెళ్లినట్టుగా రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.

Also read:కాంగ్రెస్‌ను ఊడ్చేసిన ఆప్: ఢిల్లీకి ఇప్పటివరకు సీఎంగా పనిచేసింది వీరే

అధికారంలోకి వచ్చిన తర్వాత కేజ్రీవాల్ సర్కార్ ప్రజల కోసం తీసుకొన్న అనేక కార్యక్రమాలు ప్రజలకు ఆ పార్టీని మరింత చేరువగా తీసుకెళ్లాయి. పేద ప్రజలు ఆప్ వెంట నిలిచారు. ఆప్ మరోసారి అధికారంలోకి వస్తే  ఈ పథకాలు కొనసాగుతాయని భావించి పేద ప్రజలు ఆ పార్టీకి ఓటు చేసినట్టుగా  రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.

ప్రతి ఒక్క ఇంటికి మంచినీటి సౌకర్యం, విద్యుత్ బిల్లులు, విద్య విషయంలో ఆప్ సర్కార్ తీసుకొన్న విధానపరమైన నిర్ణయాలు ఆ పార్టిని  విజయతీరం వైపు తీసుకెళ్లాయి.పేద, మద్యతరగతి ప్రజల  ఆకాంక్షలకు అనుగుణంగా కేజ్రీవాల్ ప్రభుత్వం పనిచేసింది. ఈ మేరకు ఆ పార్టికి ప్రజలు పట్టం కట్టినట్టుగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios