Asianet News TeluguAsianet News Telugu

Delhi air pollution : ఢిల్లీ వాయు కాలుష్యం.. ఆ వాహనాలకు దేశ రాజధానిలోకి నిషేధం విధించిన ఆప్ సర్కార్..

Delhi air pollution :  ఢిల్లీ వాయు కాలుష్యం తగ్గించేందుకు ఆప్ సర్కార్ చర్యలు చేపడుతోంది. అందులో భాగంగా ఇతర రాష్ట్రాల్లో రిజిస్టర్ అయిన యాప్ ఆధారిత క్యాబ్ ల ప్రవేశాన్ని నగరంలోకి నిషేధించింది.

Delhi air pollution.. AAP government has banned those vehicles from entering the national capital..ISR
Author
First Published Nov 8, 2023, 3:04 PM IST

Delhi air pollution : ఢిల్లీ వాయు కాలుష్యం నేపథ్యంలో ఆప్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. కాలుష్యం తగ్గించేందుకు ఢిల్లీ సర్కార్ తీసుకుంటున్న చర్యలపై సుప్రీంకోర్టు మంగళవారం అసంతృప్తి వ్యక్తం చేసింది. ప్రభుత్వంపై మండిపడింది. ఈ నేపథ్యంలో ఇతర రాష్ట్రాల్లో రిజిస్టర్ అయిన యాప్ ఆధారిత క్యాబ్‌ల ప్రవేశాన్ని నిషేధించింది.

విమానంపై నుంచి పడి ఎయిరిండియా ఇంజినీర్ మృతి.. అసలేం జరిగిందంటే ?

ఢిల్లీలో మొత్తం గాలి నాణ్యత 'చాలా పేలవమైన' కేటగిరీ నమోదైన  మరుసటి రోజే 'తీవ్రమైన' కేటగిరీకి పడిపోవడంతో ఈ పరిణామం చోటు చేసుకుంది. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపీసీబీ) గణాంకాల ప్రకారం ఉదయం 7 గంటలకు నగరంలో మొత్తం వాయు నాణ్యత సూచిక (ఏక్యూఐ) 421గా నమోదైంది.

విజయసాయిరెడ్డి గురివింద గింజ మాటలు మానుకోవాలి - బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సాధినేని యామిని శర్మ

ముఖ్యంగా ఢిల్లీ-నేషనల్ క్యాపిటల్ రీజియన్ (ఎన్సీఆర్)లో అక్టోబర్, నవంబర్ నెలల్లో వాయు కాలుష్యం సమస్యతో సతమతమవుతున్న ప్రజల ఆందోళనలను తగ్గించడానికి సుప్రీంకోర్టు ప్రతీ సంవత్సరం అనేక ఆదేశాలు జారీ చేస్తోంది. తాజాగా కూడా ఢిల్లీ, పంజాబ్ ప్రభుత్వాలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. 

Follow Us:
Download App:
  • android
  • ios