ఎయిర్‌హోస్టెస్ ఆత్మహత్యకు కారణమిదే.. తాను రెండవ భార్యనని తెలిసి తట్టుకోలేక

delhi air hostess suicide case: husband harrased anissia batra
Highlights

దక్షిణ ఢిల్లీలో సంచనల సృష్టించిన ఎయిర్‌హోస్టెస్ ఆత్మహత్య కేసులో చిక్కుముడి వీడినట్లే కనిపిస్తుంది. ఈ ఘటనలో ఆమె భర్త మయాంక్‌ను విచారించిన పోలీసులు ఆయన తొలి వివాహం గురించి దాచడం వల్లే ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లుగా ధ్రువీకరించారు

దక్షిణ ఢిల్లీలో సంచనల సృష్టించిన ఎయిర్‌హోస్టెస్ ఆత్మహత్య కేసులో చిక్కుముడి వీడినట్లే కనిపిస్తుంది. ఈ ఘటనలో ఆమె భర్త మయాంక్‌ను విచారించిన పోలీసులు ఆయన తొలి వివాహం గురించి దాచడం వల్లే ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లుగా ధ్రువీకరించారు. ఈ విషయాన్ని ఆమెకు చెప్పకుండానే మయాంక్ అనిస్సియాను వివాహం చేసుకున్నాడు.. గత నెలలో మయాంక్ మొదటి పెళ్లి గురించి అనిస్సియాకు తెలిసింది.. దీంతో ఇద్దరి మధ్యా గొడవలు ప్రారంభమయ్యాయి.

స్వతహాగా సున్నిత మనస్కురాలైన అనిస్సియా తరచూ గొడవలు పడటం.. భర్త చేసిన మోసాన్ని తట్టుకోలేకపోయింది. ఈ క్రమంలో గత ఆదివారం హౌజ్‌ఖాస్‌ ప్రాంతంలోని తన ఇంటి టెర్రస్ నుంచి కిందకు దూకి చనిపోయింది. చివరిసారిగా తాను చనిపోతున్నట్లుగా భర్తకు మెసేజ్ పెట్టింది. స్థానికుల సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని కేసు నమోదు చేసుకున్నారు.

అనిస్సియా ఆత్మహత్య తర్వాత భర్త పరారీలో ఉండటంతో అతనికి సంబంధించిన బెంజ్ కారు, ఇద్దరి మొబైల్ ఫోన్లు, డైమండ్ రింగ్‌లను స్వాధీనం చేసుకుని.. సోమవారం మయాంక్‌ను అదుపులోకి తీసుకున్నారు. వివాహం సమయంలో అనిస్సియా తల్లిదండ్రులు అడిగినంత కట్నంతో పాటు బీఎండబ్ల్యూ కారు కూడా బహుకరించారు.

హనీమూన్‌కు వెళ్లిన రెండో రోజు నుంచి తమ కుమార్తెను కొట్టేవాడని.. అదనపు కట్నం కోసం వేధించేవాడని పోలీసులకు అనిస్సియా తల్లిదండ్రులు తెలిపారు.. మయాంక్‌తో పాటు అతని తల్లిదండ్రులను కూడా అరెస్ట్ చేయాలని వారు డిమాండ్  చేశారు.
 

loader