ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ కల్లోలం రేపుతున్న సంగతి తెలిసిందే. తెల్లారితే బాధితుల సంఖ్య ఎంత పెరిగింది...? ఎంతమంది చనిపోయారు..? దేశంలో ఎంతమందికి పాజిటివ్ తేలింది అనే వార్తలే వినిపిస్తున్నాయి.

ఇలాంటి పరిస్థితుల్లో కరోనా మహమ్మారిపై హైడ్రాక్సీక్లోరోక్విన్ సమర్ధవంతంగా పనిచేస్తుందని భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) వెల్లడించింది. అలాగే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సైతం ఈ డ్రగ్ మంచి ఫలితాలను ఇచ్చిందని చెప్పారు.

Also Read:లాక్‌డౌన్ ఉల్లంఘన: ప్రశ్నించిన పోలీసులపై కత్తులతో దాడి

దీంతో ఈ మందును ఉత్పత్తిలో ప్రపంచంలోనే ప్రథమ స్థానంలో ఉన్న భారత్‌వైపు అన్ని దేశాలు చూస్తున్నాయి. ఇప్పటికే వివిధ దేశాలకు భారతదేశం హైడ్రాక్సీక్లోరోక్విన్‌ను ఎగుమతి చేసింది.

అయితే ఈ డ్రగ్ వినియోగం అందరికీ మంచిది కాదని ఢిల్లీలోని ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్ గులేరియా అన్నారు. కరోనా నియంత్రణకు హైడ్రాక్సీక్లోరోక్విన్‌ కొంతమేర పనిచేస్తుందని గణాంకాలు చెబుతున్నాయి. అయితే అవి బలంగా లేవని, కేవలం బాధితులకు సహాయకారిగా ఉంటుందని మాత్రం ఐసీఎంఆర్ నిపుణులు చెప్పారని గులేరియా గుర్తుచేశారు.

హెచ్‌సీక్యూ, అజిత్రోమైసిన్ కాంబినేషన్‌లో ఔషధాలను వినియోగించడం ద్వారా కోవిడ్ 19తో బాధపడేవారు కాస్త కోలుకున్నారని చైనా, ఫ్రాన్స్‌లలో జరిపిన అధ్యయనాలు చెబుతున్నాయి. అయితే, అవి కూడా అంత విశ్వసనీయంగా లేవని రణదీప్ చెప్పారు.

Also Read:ఇండియాలో 24 గంటల్లో 909 కరోనా కొత్త కేసులు, మొత్తం 8356కి చేరిక

హైడ్రాక్సీక్లోరోక్విన్ ఔషధాలు వినియోగించడం అందరికీ మంచిది కాదని, హైడ్రాక్సీక్లోరోక్విన్‌ వినియోగించడం అందరికీ మంచిది కాదని గులేరియా తెలిపారు. హైడ్రాక్సీక్లోరోక్విన్ వల్ల కొన్నిసార్లు గుండెపోటుకు దారి తీయొచ్చని, దుష్ప్రభావాలు కూడా ఉంటాయని రణ్‌దీప్ గులేరియా అభిప్రాయపడ్డారు.