Asianet News TeluguAsianet News Telugu

rain: ఢిల్లీలో భారీ వ‌ర్షం.. 22 ఏండ్ల రికార్డు బ్రేక్‌.. ప‌లు రాష్ట్రాల‌కు ఐఎండీ హెచ్చరిక‌లు

rain: దేశ రాజ‌ధానిలో శ‌నివారం ఉద‌యం నుంచి ఉరుములు మెరుపుల‌తో కూడిన వ‌ర్షాలు కురుస్తున్నాయి. ఢిల్లీతో పాటు ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్‌, రాజ‌స్థాన్ ల‌లో కూడా వ‌ర్షాలు కురుస్తున్నాయి. రానున్న మ‌రికొన్ని గంట‌ల్లో మోస్తారు నుంచి భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం వుంద‌ని భార‌త వాతావ‌ర‌ణ విభాగం అంచానా వేసింది. రానున్న మూడు రోెజుల్లో తెలంగాణలోనూ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది.  
 

Delhi adjoining areas of NCR witness rain for second consecutive day
Author
Hyderabad, First Published Jan 9, 2022, 10:33 AM IST

rain: రాబోయే మ‌రిన్ని కొన్ని గంట‌ల్లో దేశ రాజ‌ధాని ఢిల్లీతో పాటు జాతీయ రాజధాని ప్రాంతం (NCR) పరిసర ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు తీవ్రతతో కూడిన భారీ వర్షం కురిసే అవ‌కాశ‌ముంద‌ని భార‌త వాతావ‌ర‌ణ విభాగం (India Meteorological Department) పేర్కొంది. ఈ స‌మ‌యంలో ఉరుములు, మెరుపులతో (thunderstorms) కూడిన గాలివానలు కొనసాగుతాయని  కూడా ఐఎండీ అంచనా వేసింది. "ఢిల్లీ, NCR ప‌రిధిలోని దేహత్, హిండన్ AF స్టేషన్, బహదూర్‌గఢ్, ఘజియాబాద్, ఇందిరాపురం,ఛప్రౌలా, నోయిడా, దాద్రీ, గ్రేటర్ నోయిడా, గురుగ్రామ్, మనేసర్ పరిసర ప్రాంతాలలో తేలికపాటి నుండి మోస్తరు లేదా ఉరుములు మెరుపుల‌తో కూడిన భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంది" అని భార‌త వాతావ‌ర‌ణ విభాగం ట్విట్ట‌ర్ ద్వారా వెల్ల‌డించింది.  హ‌ర్యానాలోని ప‌లు ప్రాంతాల్లోనూ వ‌ర్షాలు కురుస్తాయ‌ని తెలిపింది. దేశ రాజ‌ధానిలో ప్ర‌స్తుతం కురుస్తున్న వాన‌ల కార‌ణంగా గాలి నాణ్య‌త కాస్త మెరుగుప‌డింద‌ని అధికారులు పేర్కొంటున్నారు. గాలి కాలుష్యంతో ఇబ్బంది ప‌డుతున్న ఢిల్లీ ప్ర‌జ‌ల‌కు ప్ర‌స్తుతం కురిసిన వాన‌ల‌తో కాస్త ఊర‌ట క‌లిగింద‌ని పేర్కొంటున్నారు. 

ఢిల్లీతో పాలు ఉత్త‌ర భార‌తంలోని ప‌లు రాష్ట్రాల్లో శ‌నివారం ఉద‌యం నుంచి వ‌ర్షాలు ప‌డుతున్నాయి. ఈ నేప‌థ్యంలోనే భార‌త వాతావ‌ర‌ణ విభాగం (ఐఎండీ) ప‌లు రాష్ట్రాల‌కు హెచ్చిరిక‌లు సైతం జారీ చేసింది. ఢిల్లీ-ఎన్‌సిఆర్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్‌లోని కొన్ని ప్రాంతాల్లో శనివారం భారీ వర్షం కురిసింది. పలు ప్రాంతాల్లో వడగళ్ల వాన (rain) కూడా కురిసింది. మ‌రికొన్ని ప్రాంతాల్లో ఉరుములు మెరుపుల‌తో (thunderstorms) కూడిన వాన‌లు ప‌డ్డాయి. ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్‌లోని పలు ప్రాంతాల్లో భారీ హిమపాతం కొనసాగుతోంది. పర్వతాల్లో మంచు కురుస్తుండడం, మైదాన ప్రాంతాల్లో వర్షం కురుస్తుండటంతో చలి తీవ్ర‌త అధికంగా పెరిగింది. ఆయా ప్రాంతాల్లో వ‌ర్షాలు ప‌డే అవ‌కాశ‌ముంద‌ని India Meteorological Department పేర్కొంది. రానున్న 24-48 గంటల్లో పశ్చిమ హిమాలయ ప్రాంతంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. వాయువ్య మైదానాల్లో జ‌న‌వ‌రి 9 అర్థ‌రాత్రి వ‌ర‌కు  భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంద‌ని తెలిపింది. 

అలాగే, ఈ నెల 9 నుంచి 12 వ‌ర‌కు దేశంలోని ప‌లు ప్రాంతాల్లో వ‌ర్షాలు కురుస్తాయ‌ని అంచనా వేసింది. ముఖ్యంగా మ‌ధ్య భార‌తంలో బలమైన ఉరుములతో వాన‌లు కురుస్తాయ‌ని తెలిపింది. రానున్న మూడు రోజుల్లో విదర్భ, ఛత్తీస్‌గఢ్‌, జార్ఖండ్‌, తెలంగాణ రాష్ట్రాల్లోనూ ప‌లు చోట్ల వ‌ర్షాలు ప‌డే అవకాశ‌ముంద‌ని తెలిపింది. అలాగే, ఉత్త‌రాఖండ్ సహా ప‌రిస‌ర ప్రాంతాల్లో వ‌ర్షంతో పాటు మంచు కూడా కురుస్తుంద‌ని వెల్ల‌డించింది. దీంతో చ‌లి తీవ్ర‌త మ‌రింతగా పెరుగుతుంద‌ని India Meteorological Department అంచనా వేసింది.  రాజధాని ఢిల్లీ, పరిసర ప్రాంతాల్లో (NCR) శ‌నివారం నుంచి వ‌ర్షాలు ప‌డుతున్నాయి. దీంతో ఉష్ణోగ్రతలు కూడా తగ్గుముఖం పట్టాయి. ఢిల్లీలో శనివారం 22 సంవత్సరాల తర్వాత జనవరిలో ఒకే రోజులో అత్యధిక వర్షపాతం నమోదైంది. దాదాపు రెండు నెలల్లో నగరంలో అత్యుత్తమ గాలి నాణ్యత కూడా నమోదు అయింది. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ (CPCB) ప్రకారం, రాత్రిపూట కురిసిన వర్షాల కారణంగా నగరంలోని గాలి నాణ్యత మెరుగుపడింది. 

Follow Us:
Download App:
  • android
  • ios