మరో పెళ్లికి సిద్ధమైన భార్య.. ఆత్మహత్య చేసుకున్న భర్త

Dejected husband records statement on phone before killing self in MP
Highlights

ఆత్మహత్యను సెల్ఫీ వీడియోలో చిత్రీకరించిన భర్త


ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య.. తనను వదిలి వెళ్లిపోయిందనే మనస్థాపంతో ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మధ్యప్రదేశ్‌లోని ఛటర్‌పూర్‌ జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు 
తెలిపిన వివరాల ప్రకారం.. మధ్యప్రదేశ్‌ ఛటర్‌పూర్‌ జిల్లా గంజ్‌ గ్రామానికి చెందిన తులసీదాస్‌ పాటిల్‌(28) పెద్దలను ఎదురించి ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఆమె మెడికల్‌ క్లీనిక్‌ పెడతానంటే ఇంటిని అమ్మి 2లక్షల డబ్బు సహాయం చేశాడు. 

కొంతకాలం పాటు దంపతులు ఇద్దరూ అన్యోన్యంగా గడిపారు. అయితే ఆ అన్యోన్యత ఎక్కువ కాలం సాగలేదు. తులసీదాస్ తన భార్యను ప్రేమగా చూసుకున్నప్పటికీ.. ఆమె అతనిని విడిచి వెళ్లిపోయింది. తనతో కలిసి జీవించలేనని చెప్పి విడాకుల నోటీసు కూడా పంపింది. దీంతో మనస్తాపానికి గరైన తులసీదాస్‌ విషం తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.

ఆత్మహత్యకు ముందు తన చావుకు కారణాలను తెలుపుతూ వీడియో సెల్ఫీ తీసి దాన్ని అతని బావకు పంపాడు. ‘‘ ప్రాణంగా ప్రేమించిన ఆమె నన్ను దూరంగా పెడుతోంది. ఆమెకు కుటుంబ సభ్యులు మరో పెళ్లి చేయడానికి సిద్దపడుతున్నారని తెలిసింది. ఆమె బంధువలతో గొడవపడేంత దమ్ము నాకు లేదు అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నాను. ఇంట్లో భద్రపరిచిన పెళ్లికి సంబంధించిన కొన్ని ఫోటోలు, మ్యారేజ్‌ సర్టిఫికేట్లు పోలీసులు చూడాలి’’అని ఆ సెల్ఫీ వీడియోలో తులసీదాస్‌ కోరాడు. ఆలస్యంగా వీడియో చూసిన తులసీదాస్‌ బావ పోలీసులను ఆశ్రయించడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

loader