Asianet News TeluguAsianet News Telugu

అగ్ని ప్రైమ్ బాలిస్టిక్ క్షిపణి ప్రయోగం విజయవంతం.. డీఆర్ డీవో ను అభినందించిన రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్

కొత్త తరం బాలిస్టిక్ క్షిపణి ‘అగ్ని ప్రైమ్’ను డీఆర్డీవో విజయవంతంగా పరీక్షించింది. ఒడిశా తీరంలోని ఓ ద్వీపం నుంచి గురువారం ఈ పరీక్ష నిర్వహించారు. డీఆర్ డీవో అధికారులను రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అభినందించారు. 

Defense Minister Rajnath Singh congratulated DRDO on the successful launch of Agni Prime ballistic missile..ISR
Author
First Published Jun 9, 2023, 9:01 AM IST

కొత్త తరం బాలిస్టిక్ క్షిపణి ‘అగ్ని ప్రైమ్’ను ఒడిశా తీరంలోని ఓ ద్వీపం నుంచి గురువారం విజయవంతంగా పరీక్షించినట్లు అధికారులు తెలిపారు. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్ డీవో) డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ఐలాండ్ నుంచి ఈ పరీక్షను నిర్వహించిందని, అన్ని లక్ష్యాలను విజయవంతంగా పూర్తి చేశామని వారు తెలిపారు.

అఖండ భారత్ మ్యాప్ వివాదం : భారత భూభాగాలను కలుపుకొని ఆఫీసులో ‘గ్రేటర్ నేపాల్’ మ్యాప్ పెట్టిన ఖాట్మండు మేయర్

క్షిపణి మూడు విజయవంతమైన అభివృద్ధి పరీక్షల తరువాత నిర్వహించిన మొదటి ప్రీ-ఇండక్షన్ నైట్ ప్రయోగం ఇదేనని, ఇది వ్యవస్థ ఖచ్చితత్వం, విశ్వసనీయతను ధృవీకరించిందని తెలిపారు. రాడార్, టెలిమెట్రీ, ఎలక్ట్రో ఆప్టికల్ ట్రాకింగ్ సిస్టమ్స్ వంటి రేంజ్ ఇన్స్ట్రుమెంటేషన్ వ్యవస్థలను రెండు డౌన్-రేంజ్ నౌకలతో సహా వివిధ ప్రదేశాలలో మోహరించినట్లు పేర్కొన్నారు.

కాగా..  డీఆర్డీవో, స్ట్రాటజిక్ ఫోర్సెస్ కమాండ్ ఉన్నతాధికారులు ఈ ప్రయోగాన్ని విజయవంతంగా వీక్షించడంతో సాయుధ దళాల్లో ఈ వ్యవస్థను ప్రవేశపెట్టేందుకు మార్గం సుగమమైంది. ఈ విజయంపై రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ డీఆర్ డీవో, సాయుధ బలగాలను అభినందించారు.

 

Follow Us:
Download App:
  • android
  • ios