Asianet News TeluguAsianet News Telugu

ఒమిక్రాన్ పై సైన్యానికి రక్షణశాఖ మార్గదర్శకాలు...ముందస్తు జాగ్రత్తలు పాటించాలని సూచన...

ఏదైనా ఒక కేంద్రంలో వారపు సగటు పాజిటివ్ రేటు ఒక శాతాన్ని మించితే సెలవు తర్వాత విధుల్లో చేరే వారందరికీ కోవిడ్ పరీక్షలు నిర్వహించాలని, బృంద సమావేశాలను రద్దు చేయాలని సూచించింది. క్వారంటైన్ వసతులను సిద్ధం చేసుకోవాలని తెలిపింది. అధికారుల సమావేశాలన్నీ వర్చువల్ విధానంలోనే జరుపుకోవాలని స్పష్టం చేసింది. 

Defense Guidelines for the Army over Omicron Scare
Author
Hyderabad, First Published Jan 6, 2022, 12:16 PM IST

ఢిల్లీ : దేశంలో corona virus బాధితుల సంఖ్య పెరిగిపోతున్న నేపథ్యంలో సైనిక బలగాలు, సిబ్బంది అందరికీ Ministry of Defense మార్గదర్శకాలు జారీ చేసింది. వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు అన్ని రకాల Precautions పాటించాలని తెలిపింది. డిసెంబర్ 31తో ముగిసిన వారంలో సైనిక సిబ్బందిలో Virus positivity rate 2.34 గా ఉంది.

ఏదైనా ఒక కేంద్రంలో వారపు సగటు పాజిటివ్ రేటు ఒక శాతాన్ని మించితే సెలవు తర్వాత విధుల్లో చేరే వారందరికీ కోవిడ్ పరీక్షలు నిర్వహించాలని, బృంద సమావేశాలను రద్దు చేయాలని సూచించింది. క్వారంటైన్ వసతులను సిద్ధం చేసుకోవాలని తెలిపింది. అధికారుల సమావేశాలన్నీ వర్చువల్ విధానంలోనే జరుపుకోవాలని స్పష్టం చేసింది. 

వారపు సగటు పాజిటివిటీ రేటు 2 నుంచి 5 వరకు ఉంటే.. సెలవుల తర్వాత విధుల్లో చేరే వారిని వారం రోజుల పాటు క్వారంటైన్ లో ఉంచాలని, కరోనా పరీక్షల తర్వాతే వెలుపలకు అనుమతించాలని వివరించింది. పాజిటివిటీ రేటు 5 నుంచి 10 వరకు ఉంటే సైనిక కార్యాలయాల్లో సిబ్బంది సంఖ్యపై పరిమితి విధించాలని ఆదేశించింది.

సైనిక ఆస్పత్రులన్నీ కొవిడ్ సంబంధిత సేవలను, అత్యవసర సేవలను అందించాలని తెలిపింది. పడకల ఆక్యుపెన్సీ రేషియో 40 శాతం దాటితే అత్యవసరం కాని సాధారణ శస్త్ర చికిత్సలను వాయిదా వేయాలని రక్షణ మంత్రిత్వ శాఖ పేర్కొంది. 

CORONA VIRUS : జ‌మ్మూ కాశ్మీర్ లో రాత్రి 9 నుంచి ఉద‌యం 6 వ‌ర‌కు క‌రోనా ఆంక్ష‌లు..

ఇదిలా ఉండగా, దేశంలో కోవిడ్ -19 (COVID-19) రెండు వేవ్‌లు ఇప్ప‌టికే వ‌చ్చిపోయాయి. ఈ రెండు వేవ్‌లు దేశాన్ని అత‌లాకుత‌లం చేశాయి. ఆర్థికంగా చాలా ఇబ్బందుల‌కు గురి చేసింది. ఎంతో మంది ఉద్యోగాలు కోల్పొయారు. మ‌రి కొంద‌రు ఆత్మీయులను కోల్పొయారు. ఈ రెండు వేవ్ ల స‌మ‌యంలో ఎంతో మంది మృతి చెందారు. అయితే ఇప్పుడు ఒమిక్రాన్ విజృంభ‌న కొనసాగుతోంది. 

దాదాను నెల రోజుల వ్య‌వ‌ధిలోనే కేసులు సంఖ్య గ‌ణ‌నీయంగా పెరుగుతోంది. అయితే ఇప్ప‌టి వ‌ర‌కు విదేశాల్లోనే ఉన్న ఒమిక్రాన్ మ‌ర‌ణాలు నిన్న ఇండియాలోనూ చోటు చేసుకుంది. ఈ మేర‌కు కేంద్ర ప్ర‌భుత్వం అధికారికంగా తెలిపింది. ఈ విష‌యంలో కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ మీడియాతో మాట్లాడారు. రాజాస్థాన్‌లో తొలి ఒమిక్రాన్ మ‌ర‌ణం సంభ‌వించింద‌ని తెలిపారు. మృతుడు వృద్ధుడ‌ని, అత‌డు అప్ప‌టికే షుగ‌ర్‌, ఇత‌ర అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్నాడ‌ని అన్నారు. 

ఇక రోజురోజుకూ.. దేశంలో పెరుగుతున్న క‌రోనా కేసులు ఆందోళ‌న క‌లిగిస్తున్నాయి. క‌రోనా కేసులు పెరుగుతుండటంతో అన్ని రాష్ట్రాలు ఆంక్ష‌లు విధిస్తున్నాయి. ఇప్ప‌టికే చాలా రాష్ట్రాలు నైట్ క‌ర్ఫ్యూలు విధించాయి. ఇప్పుడు ఈ జాబితాలో మ‌రో రాష్ట్రం చేరింది. ఈ మేర‌కు జ‌మ్ము కాశ్మీర్ ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది. ఈ ఉత్త‌ర్వుల ప్ర‌కారం.. రాత్రి 9 నుంచి ఉద‌యం 6 వ‌ర‌కు ఆంక్ష‌లు విధించింది. కేవ‌లం అత్య‌వ‌స‌ర సేవ‌ల‌కు మాత్ర‌మే అనుమ‌తి ఇచ్చింది. ప్ర‌భుత్వం త‌దుప‌రి ఉత్త‌ర్వులు ఇచ్చేంత వ‌ర‌కు ఈ ఆంక్ష‌లు అమ‌లులో ఉంటాయ‌ని చెప్పింది. 

Follow Us:
Download App:
  • android
  • ios