న్యూఢిల్లీ: భారత్-చైనా సరిహద్దుల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో కొత్త యుద్ధ విమానాలను కొనుగోలు చేయాలని ఇండియా నిర్ణయం తీసుకొంది.

డిఫెన్స్ ఎక్విజిషన్ కౌన్సిల్(డీఏసీ) గురువారం నాడు ఈ కీలక నిర్ణయం తీసుకొంది. 21 మిగ్-29 యుద్ధ విమానాలతో పాటు 59 ఎంఐజీ-29 విమానాల ఆధునీకీకరణకు డీఏసీ అనుమతి ఇచ్చింది.

అంతేకాదు 12 ఎస్‌యూ-30 ఎంకేఐల కొనుగోలు చేయనుంది. ఎంఐజీ-29 యుద్ద విమానాల కొనుగోలు, ఆధునీకీకరణకు రూ. 7400 వెచ్చించనుంది. రూ. 10,700 కోట్లతో 12 సుఖోయ్ యుద్ద విమానాలు కొనుగోలు చేయనుంది. రష్యా నుండి ఈ విమానాలను కొనుగోలు చేయనుంది.

also read:గాల్వన్ ఘర్షణ.. చైనా వైపు మనకంటే రెట్టింపు చనిపోయారు: కేంద్రమంత్రి సంచలన వ్యాఖ్యలు

భారత వైమానిక దళం, నావికా దళం కోసం 248 బియాండ్ విజువల్ రేంజ్ ఎయిర్ టూ ఎయిర్ క్షిపణుల కొనుగోలు చేయడానికి కూడ డీసీఏ పచ్చ జెండా ఊపింది. డీఆర్‌డీఓ ద్వారా కొత్తగా  వెయ్యి కిలోమీటర్ల దూరంలో క్షిపణిని డెవలప్ చేసింది.

చైనాకు చెందిన పీపుల్ లిబరేషన్ ఆర్మీ వైమానిక దళం గ్జియాంగ్, టిబెట్ ప్రాంతాల్లో తమ సైన్యాన్ని మోహరించింది. భారత సైన్యం తూర్పు లడఖ్ ప్రాంతంలో వాయి రక్షణ వ్యవస్థలను మోహరించింది.

యుద్ద విమానాల కొనుగోలు, ఆధునీకీకరణ చేపట్టాలని చాలా కాలంగా  కోరుతున్నాయి. దీంతో డీఏసీ ఈ మేరకు అనుమతిని ఇచ్చింది. రూ. 38,900 కోట్ల విలువైన ఆయుధ సామాగ్రి, రక్షణ పరికరాల కొనుగోలుకు ఆమోదం తెలిపింది. వీటిలో రూ. 31,130 కోట్ల విలువైన భారత పరిశ్రమల నుండి సమీకరించనున్నారు.