Asianet News TeluguAsianet News Telugu

ద‌మ్ముంటే ముంబై, మ‌హారాష్ట్ర అసెంబ్లీ ఎన్నిక‌ల్లో శివ‌సేన‌ను ఓడించండి - అమిత్ షాకు ఉద్ద‌వ్ ఠాక్రే స‌వాల్

ముంబై వాసులకు శివసేనకు ఉన్న అనుబంధం చాలా లోతైనదని, దానిని ఎవరూ విడదీయలేరని మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్దవ్ ఠాక్రే అన్నారు. వచ్చే బీఎంసీ ఎన్నికల్లోనూ శివసేన విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. 

Defeat Shiv Sena in Mumbai and Maharashtra assembly elections if you dare - Uddav Thackeray challenges Amit Shah
Author
First Published Sep 22, 2022, 1:04 PM IST

బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) ఎన్నికల్లోనూ, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లోనూ శివసేనను ఓడించాలని కేంద్ర హోంమంత్రి, బీజేపీ సీనియర్ నేత అమిత్ షాకు మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే సవాల్ విసిరారు. ఒక నెలలో BMC ఎన్నికలు, రాష్ట్ర ఎన్నికలను నిర్వహించాలని అన్నారు. బుధ‌వారం సబర్బన్ గోరేగావ్‌లో పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి థాకరే మాట్లాడారు. 

గవర్నర్ vs ప్రభుత్వం: బీజేపీయేతర పాలిత రాష్ట్రాల్లోనే ఎందుకు ఇలా.. ?

‘‘ ముంబయి సివిక్ ఎన్నికల్లో శివసేన తన స్థానాన్ని చూపించాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షా తన పార్టీని (బీజేపీ) కోరారు. సరే. దానిని నేను అంగీకరిస్తాను. నేను ధైర్యం చేస్తాను. ముంబై నగరంతో శివసేనకు ఉన్న బంధం విడదీయరానిది. సామాన్య ముంబై వాసుల రోజువారి జీవితానికి పార్టీకి ఉన్న మంచి అనుబంధం ఉంది. అవ‌స‌రమైన‌ప్పుడు పార్టీ వారి కోసం ప‌రుగులు పెడుతుంది.” అని తెలిపారు. 

‘‘ ముంబయి, శివసేన మధ్య బంధం ఎందుకు బలంగా ఉందంటే.. పార్టీ శాఖలు అన్ని సమయాల్లో తెరిచి ఉంటాయి. కాబట్టి అవ‌స‌ర‌మైన‌ప్పుడు పార్టీ రక్తదానాలు చేస్తుంది. హాస్పిట‌ల్ కు వెళ్తుంది. పాఠశాల‌ల్లో విద్యార్థుల‌ను చేరుస్తుంది. ఉద్యోగాలు క‌ల్పించ‌డంలో సాయం చేస్తుంది. ప్ర‌జ‌ల‌కు ఎప్పుడూ సహాయం చేస్తుంటుంది. ’’అని ఉద్దవ్ ఠాక్రే అన్నారు. 

‘‘ ముంబైని గెలవాలని ఆలోచించే ముందు మీరు (బీజేపీ) ఈ సిటీని అర్థం చేసుకున్నారా ? సివిక్ సొసైటీని గెలుచుకునే ముందు.. శివసేన కలిగి ఉన్న ముంబైకర్ల హృదయాలను గెలుచుకోండి ’’ అని ఆయన అన్నారు. ఈ సంద‌ర్భంగా ఎంఎన్ఎస్ అధినేత రాజ్ ఠాక్రేను టార్గెట్ చేస్తూ ఉద్ద‌వ్ కామెంట్స్ చేవారు. ‘‘ మున్నా భాయ్ (రాజ్ థాకరే) కూడా బీజేపీతో కలిసి వచ్చారు. దీని వల్ల నాకు ఎలాంటి స‌మ‌స్య లేదు. అందరితో పోరాడతాను. ఇదే చివరి ఎన్నికలని దేవేంద్ర ఫడ్నవీస్ అన్నారు. ఆ ఎన్నిక‌ల్లో ఇలాగే పోరాడండి. ఇదే వారికి చివరి ఎన్నికలు అని చెప్పాలి. షిండే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వేదాంత-ఫోస్కాన్ ప్రాజెక్టు గుజరాత్‌కు వెళ్లింది.’’ అని అన్నారు.

విలువ‌ల‌తో విశ్వ‌స‌నీయ‌మైన వార్త‌ల‌ను అందించ‌డం మీడియాకు ఒక స‌వాల్ - కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్

ఈ సంద‌ర్భంగా తన మాజీ మిత్రపక్షమైన బీజేపీపై తీవ్ర విమ‌ర్శ‌లు చేసిన ఉద్ద‌వ్ ఠాక్రే.. ముంబైను చలించని ఆస్తి ముక్కగా పరిగణించకుండా, మహానగరాన్ని నిర్మించడంలో ఏ విధంగా సాయం చేసిందో ప్ర‌జ‌ల‌కు చెప్పాల‌ని కోరారు. కాగా. దాదాపు 30 ఏళ్లుగా శివసేన బృహన్‌ముంబై మునిసిపల్ కార్పొరేషన్ (BMC) ను పాలిస్తోంది. ప్ర‌స్తుతం ఆ పౌర సంస్థ ఐదేళ్ల పదవీకాలం ముగిసింది. దీంతో త్వ‌ర‌లో ఆ కార్పొరేష‌న్ కు ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఈ నేప‌థ్యంలోనే ఉద్ద‌వ్ ఠాక్రే బీజేపీ విరుచుకుప‌డ్డారు. 

2017లో బీఎంసీకి చివ‌రిసారిగా ఎన్నిక‌లు జ‌రిగాయి. ఆ స‌మ‌యంలో దేవేంద్ర ఫడ్నవీస్ నేతృత్వంలోని కూట‌మి ప్ర‌భుత్వంలో శివ‌సేన భాగ‌స్వామిగా ఉంది. కానీ ఆ బీజేపీ, శివ‌సేన ఆ ఎన్నిక‌ల్లో విడివిడిగానే పోటీ చేశాయి. బీఎంసీలో మొత్తం 227 సీట్లు ఉండ‌గా.. బీజేపీ 82 సీట్లు గెలుచుకుంది. శివ‌సేన 84 స్థానాలు గెలుచుకుంది. అయితే రాబోయే ఎన్నిక‌ల్లో బీజేపీ, శివసేన (షిండే వర్గం)తో క‌లిసి 150 సీట్లు గెలుచుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios