Asianet News TeluguAsianet News Telugu

సోనియాపై వివాదాస్పద వ్యాఖ్యలు.. ఆర్నాబ్ గోస్వామికి సుప్రీంలో ఊరట

రిపబ్లికన్ టీవీ చీఫ్ ఆర్నాబ్ గోస్వామికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ప్రతిష్టకు భంగం కలిగించారంటూ దాఖలైన పిటిషన్‌పై శుక్రవారం సర్వోన్నత న్యాయస్థానం విచారణ జరిపింది

Defamation case: S C grants relief to journalist Arnab Goswami
Author
New Delhi, First Published Apr 24, 2020, 4:45 PM IST

రిపబ్లికన్ టీవీ చీఫ్ ఆర్నాబ్ గోస్వామికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ప్రతిష్టకు భంగం కలిగించారంటూ దాఖలైన పిటిషన్‌పై శుక్రవారం సర్వోన్నత న్యాయస్థానం విచారణ జరిపింది.

అనంతరం మూడు వారాల పాటు గోస్వామికి అరెస్ట్ నుంచి రక్షణ కల్పిస్తూ సుప్రీం ఆదేశాలు జారీ చేసింది. అలాగే ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించింది.

Also Read:జర్నలిస్ట్ ఆర్నబ్ గోస్వామిపై.. యూత్ కాంగ్రెస్ కార్యకర్తల దాడి..!

ఇటీవల పాల్గఢ్‌లో చోటు చేసుకున్న మూక హత్యకు సంబంధించి సోనియా గాంధీపై గోస్వామి తన టీవీ ఛానెల్‌లో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో కాంగ్రెస్ శ్రేణులు భగ్గుమన్నాయి.

దేశవ్యాప్తంగా పలు చోట్ల ఆర్నాబ్‌పై ఎఫ్ఐఆర్‌లు దాఖలయ్యాయి. ఈ క్రమంలో తనపై దాఖలైన ఎఫ్ఐఆర్‌ల ఆధారంగా ఎలాంటి చర్యలూ తీసుకోకుండా స్టే విధించాలని కోరుతూ గోస్వామి సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేశారు.

దీనిపై శుక్రవారం జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ ఎంఆర్ షా నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ జరిపింది. గోస్వామి తరపున సీనియర్ అడ్వొకేట్ ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించారు. ఆర్నాబ్‌పై దాఖలైన అన్ని కేసుల పైనా స్టే విధించిన సుప్రీంకోర్టు.. ఒక్క నాగ్‌పూర్‌లో దాఖలైన కేసులో మాత్రం స్టే విధించలేదు.

ఈ కేసును ముంబైకి బదిలీ చేసింది. అలాగే అర్నాబ్ గోస్వామి, రిపబ్లిక్ టీవీకి పూర్తి భద్రత కల్పించాల్సిందిగా ముంబై పోలీస్ కమీషనర్‌కు సుప్రీం ఆదేశాలు జారీ చేసింది. కాగా ఈ నెల 22న ముంబైలోని స్టూడియో నుంచి ఇంటికి వెళ్తున్న ఆర్నాబ్ దంపతులపై దాడి జరిగిన విషయం తెలిసిందే. 

Follow Us:
Download App:
  • android
  • ios