హర్యానాలోని భివానీ మరణాలపై వ్యాఖ్యానిస్తూ.. మితవాద సంస్థలపై విహెచ్‌పి, భజరంగ్ దళ్ లను ఉగ్రవాద సంస్థలుగా గుర్తించి, వాటిపై నిషేధం విధించాలని  ఇతిహాద్-ఎ-మిలాట్ కౌన్సిల్ చీఫ్ మౌలానా తౌకీర్ రాజా ఖాన్ డిమాండ్ చేశారు.

హర్యానాలోని భివానీలో ఇద్దరు ముస్లిం యువకుల హత్యల ఘటన రాజకీయంగా దుమారం చేలారేగుతోంది. ప్రధానంగా బీజేపీ అనుబంధ సంస్థలైన విశ్వ హిందూ పరిషత్ (విహెచ్‌పి), భజరంగ్ దళ్ లను లక్ష్యంగా విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. తాజాగా వివాదంపై ఇట్టిహాద్-ఎ-మిలాట్ కౌన్సిల్ చీఫ్ మౌలానా తౌకీర్ రజా ఖాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. విశ్వ హిందూ పరిషత్ (విహెచ్‌పి), భజరంగ్ దళ్ వంటి మితవాద సంస్థలను ఉగ్రవాద సంస్థలుగా ప్రకటించాలని, పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పిఎఫ్‌ఐ) మాదిరిగానే నిషేధించాలని ఖాన్ డిమాండ్ చేశారు.

ఈ ఘటనపై ఇట్టిహాద్-ఎ-మిలాట్ కౌన్సిల్ (ఐఎంసీ) చీఫ్ మాట్లాడుతూ.. "భివానీ సంఘటన ఫిబ్రవరి 16 న జరిగింది, కాని మేము మా నిశ్శబ్దంగా ఉన్నాం. మా పిల్లలపై (జునైద్,నాసిర్) తప్పుడు ఆరోపణలు చేసి, వారిని హత్య చేశారు. ఈ దారుణానికి పాల్పడిన నిందితులకు మద్దతుగా సమావేశాలు,మహాపంచాయతీలు జరిగాయి.భారత్ లో హత్యలు, మూకదాడులు(మాబ్ లిన్చింగ్) సాధారణం అయిపోయాయి. పిఎఫ్‌ఐని నిషేధించిన విధంగా.. విహెచ్‌పి, బజరంగ్‭దళ్ ను‭ ఉగ్రవాద సంస్థలుగా ప్రకటించి వాటిని నిషేధించాలి" అని ఐఎంసి చీఫ్ అన్నారు. 

"భివానీలో ఏమి జరిగిందో హిందూ సమాజానికి కూడా తప్పు సందేశం పంపుతుంది. వారు ఇలాంటి చర్యలలో పాల్గొంటే.. వారిని హీరోలుగా ముద్రవేస్తున్నారు. ఈ విషయాన్ని ప్రభుత్వం గమనించాలి. లేకపోతే.. రాబోయే రోజుల్లో పరిస్థితి మరి అధ్వాన్నంగా మారుతుంది" అని అన్నారాయన.

Scroll to load tweet…

భివానీ ఘటన 

రాజస్థాన్ లోని భరత్ పూర్ జిల్లా ఘట్మీకా గ్రామానికి చెందిన నాసిర్ (25), జునైద్ (35) ఫిబ్రవరి 16న కిడ్నాప్‌కు గురయ్యారు. మరసటి రోజు హర్యానా భివానీలో కాలిపోయిన బొలేరో వాహనంలో వీరిద్దరి మృతదేహాలను గుర్తించారు. వీరిద్దరిని భజరంగ్ దళతో సంబంధం ఉన్న గోసంరక్షకులు కిడ్నాప్ చేశారనే ఆరోపణలున్నాయి. ఈ కేసులో ఎనిమిది మంది నిందితుల పేర్లను ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్న ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. నిందితులపై రాజస్థాన్ పోలీసులకు ఖచ్చితమైన ఆధారాలు లభించాయని అధికారులు తెలిపారు. అయితే ఈ ఘటనలో భజరంగ్ దళ సభ్యుడు మోను మానేసర్ ప్రమేయముంద అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది.

పశువుల స్మగ్లర్లను పట్టుకోవటానికి నిందితులందరూ ఒక ప్రైవేట్ ఆపరేషన్ చేస్తున్నారని అధికారులు తెలిపారు. ఈ ప్రక్రియలో.. వారు జునైద్,నాసిర్ ప్రయాణిస్తున్న బొలెరోను అడ్డగించారు. నిందితులు వారిద్దరని కొట్టి.. హర్యానా తీసుకెళ్లినట్టు పోలీసులు గుర్తించారు. ఈ కేసులో ఇంకా దర్యాప్తు జరుగుతోంది. ఈ కేసులో అరెస్టు చేసిన నిందితుడు రింకు సైనీ విచారణ ఆధారంగా ఈ వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. బజ్రంగ్ దాల్ తన పార్టీ సభ్యులపై రుజువు లేకుండా కేసు పెట్టడం తప్పు అని అన్నారు.