రైతు సంఘాల (farmers protest) నేత రాకేశ్ టికాయత్‌కు కేంద్రం లేఖ రాసింది. సాగు చట్టాలను రద్దు చేసినందున ఆందోళన విరమించాలని కోరింది. రైతులంతా తమ ఇళ్లకి వెళ్లిపోవాలని కోరింది. ఈ నేపథ్యంలో ఆందోళన కొనసాగించాలా..? విరమించాలా అనే దానిపై రేపు నిర్ణయం తీసుకోనున్నారు రైతులు. కేసులు ఎత్తివేయడంతో పాటు ఎంఎస్‌పీ ప్యానెల్‌లో రైతు సంఘం నేతల్ని చేర్చాలని ఎస్‌కేఎం డిమాండ్ చేస్తోంది. 

రైతు సంఘాల (farmers protest) నేత రాకేశ్ టికాయత్‌కు కేంద్రం లేఖ రాసింది. సాగు చట్టాలను రద్దు చేసినందున ఆందోళన విరమించాలని కోరింది. రైతులంతా తమ ఇళ్లకి వెళ్లిపోవాలని కోరింది. కొత్త సాగు చట్టాలకు (farm laws) వ్యతిరేకంగా గతేడాది నుంచి ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేస్తున్నారు వేలాది మంది రైతులు, అనేక రూపాలలో తమ నిరసన తెలియజేశారు. ఇటీవల రైతులకు క్షమాపణ చెప్పిన ప్రధాని నరేంద్ర మోడీ .. సాగు చట్టాలను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించారు. చెప్పినట్లుగానే పార్లమెంట్ సమావేశాల తొలిరోజే ఉభయ సభల్లో సాగు చట్టాల ఉపసంహరణ బిల్లును ఆమోదింపజేసుకున్నారు. అనంతరం దానికి రాష్ట్రపతి ఆమోదముద్ర వేశారు. ఈ నేపథ్యంలో ఆందోళన కొనసాగించాలా..? విరమించాలా అనే దానిపై రేపు నిర్ణయం తీసుకోనున్నారు రైతులు. కేసులు ఎత్తివేయడంతో పాటు ఎంఎస్‌పీ ప్యానెల్‌లో రైతు సంఘం నేతల్ని చేర్చాలని ఎస్‌కేఎం డిమాండ్ చేస్తోంది. 

కాగా.. భారతీయ కిసాన్​ యూనియన్​ ( Bharatiya kisan union) నేత రాకేశ్​ టికాయిత్​ (rakesh tikait) కు బెదిరింపు కాల్స్​ వచ్చాయి. దీంతో ఆయ‌న ఘజియాబాద్‌లోని కౌశాంబి పోలీసుల‌ను ఆశ్ర‌యించారు. ఆయ‌న ఫిర్యాదు మేర‌కు పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడు తొలుత అస‌భ్యక‌రంగా మాట్లాడి.. ఆపై చంపేస్తాన‌ని.. రోజులు లెక్క‌పెట్టుకోమ‌ని బెదిరింపుల‌కు పాల్ప‌డిన‌ట్టు అధికారులు తెలిపారు. ఆ కాల్స్ ఉత్త‌రాఖండ్ నుంచి వ‌చ్చిన‌ట్టు పోలీసులు గుర్తించారు. నిందితుడి కోసం గాలింపు చ‌ర్య‌లు చేప‌ట్టిన‌ట్టు తెలిపారు. త్వ‌ర‌లోనే ఆ నిందితుడిని ప‌ట్టుకుంటామ‌ని పోలీస్‌స్టేషన్‌ ఇన్‌ఛార్జీ సచిన్​మాలిక్ తెలిపారు. ఆడియో క్లిప్‌ను టికాయిత్ ద్వారా అందుకొని, దాని ఆధారంగా తదుపరి విచారణ జరుపుతామని వెల్లడించారు. అయితే దాని వెనుకున్న ఉద్దేశాన్ని బయటపెట్టలేదని చెప్పారు.

Also Read:బీజేపీకి బీ పార్టీ: టీఆర్ఎస్‌పై రాకేష్ తికాయత్ సంచలన వ్యాఖ్యలు

మరోవైపు ఈ ఉద్య‌మ‌నేత‌కు గ‌తంలోనూ అనేక సార్లు బెదిరింపులు కాల్స్ వచ్చాయి. ఆయ‌నను హత్య చేయాల‌ని ప‌లు కుట్ర‌లు కూడా జ‌రిగాయి. వీటిని తెలుసుకున్న పోలీసులు భ‌గ్నం చేశారు. ఆ త‌రువాత నుంచి ఆయ‌న‌కు కూడా భ‌ద్ర‌త క‌ల్పిస్తోన్నారు. కేంద్రం రూపొందించిన నూత‌న సాగు చ‌ట్టాల‌కు వ్య‌తిరేకంగా రైతులు పెద్ద ఎత్తున నిర‌స‌న‌లు చేప‌ట్టారు. వారి ఉద్య‌మం ఉప్పెన‌లా ఎగిసిన విష‌యం తెలిసిందే. ఈ ఉద్య‌మంలో ఘాజీపుర్ సరిహద్దు నుంచి టికాయిత్​ నాయ‌క‌త్వం వ‌హిస్తోన్నారు. ఆయ‌న ఆధ్వ‌ర్యంలో అనేక నిర‌స‌న కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించ‌బ‌డ్డాయి. ఈ స‌మ‌యంలో అనేక బెదిరింపులు, కుట్ర‌లు వెలుగులోకి వ‌చ్చాయి.