Asianet News TeluguAsianet News Telugu

కేరళ అస్తవ్యస్థం.....324కు చేరిన మృతుల సంఖ్య

పర్యాటక మణిహారంగా పిలిచే కేరళ వరదలతో అస్తవ్యస్థంగా మారింది. ఒకవైపు వరదలు మరోవైపు కుండపోత వర్షంతో కేరళ చిగురుటాకులా వణుకుతోంది. వరదల ప్రభావానికి 167 మంది మృత్యువాత పడినట్లు కేరళ సీఎం పినరయి విజయన్ స్పష్టం చేశారు. 

Death toll rises to 167 in Kerala
Author
Kochi, First Published Aug 17, 2018, 5:27 PM IST

కొచ్చి: పర్యాటక మణిహారంగా పిలిచే కేరళ వరదలతో అస్తవ్యస్థంగా మారింది. ఒకవైపు వరదలు మరోవైపు కుండపోత వర్షంతో కేరళ చిగురుటాకులా వణుకుతోంది. వరదల ప్రభావానికి 324 మంది మృత్యువాత పడినట్లు కేరళ సీఎం పినరయి విజయన్ స్పష్టం చేశారు. ఎడతెరపి లేకుండా కుండపోత వర్షం కురుస్తుండటంతో వరద ప్రభావం పెరుగుతూనే ఉంది. 

మరోమూడు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. రాష్ట్రంలోని 13 జిల్లాలలో రెడ్అలర్ట్ ప్రకటించింది. మరోవైపు కేరళలో వరద పరిస్థితిపై ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నానని ప్రధాని నరేంద్రమోదీ ట్వీట్ చేశారు. కేరళ వెళ్లి వరద ప్రభావం, సహాయక చర్యలపై సమీక్షిస్తానన్నారు. 

మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి అంత్యక్రియలు పూర్తైన తర్వాత ప్రధాని నరేంద్రమోదీ కేరళ రానున్నట్లు కేంద్రమంత్రి కేజే అల్పోన్స్ స్పష్టం చేశారు. రాత్రికి కొచ్చిలో బస చేసి శనివారం వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించనున్నట్లు తెలిపారు.  

మరోవైపు కేరళలోని వరద ప్రభావిత ప్రంతాల్లో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. నాలుగు కోస్ట్ గార్డ్ కేపిటల్ షిప్స్ విపత్తుల నిర్వహణ శాఖ అధికారులతో కలసి సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. 24 బృందాలు వరద ప్రభావిత గ్రామాల్లో సహాయక చర్యలు అందిస్తున్నాయి. 

ఇండియన్ కోస్ట్ గార్డ్ సిబ్బంది 1,764 మందిని కాపాడటంతోపాటు 4,688 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఇకపోతే ఆగష్టు 26 వరకు కొచ్చి ఎయిర్ పోర్టును మూసివేస్తున్నట్లు కొచ్చి ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ అధికారులు ప్రకటించారు.   
 

Follow Us:
Download App:
  • android
  • ios