Asianet News TeluguAsianet News Telugu

మళ్లీ బీజేపీతో చేతులు కలపడం కంటే చనిపోయింది నయం - బీహార్ సీఎం నితీశ్ కుమార్

మళ్లీ బీజేపీతో పొత్తు పెట్టుకునే కంటే చనిపోయిందని నయం అని బీహార్ సీఎం నితీష్ కుమార్ యాదవ్ అన్నారు. అటల్ బిహారీ వాజ్ పేయి, ఎల్ కే అద్వానీల తరువాత బీజేపీ మొత్తం మారిపోయిందని తెలిపారు. 

Death is better than joining hands with BJP again - Bihar CM Nitish Kumar
Author
First Published Jan 30, 2023, 5:00 PM IST

బీజేపీ తమ పార్టీ మళ్లీ పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని బీహార్ సీఎం నితీష్ కుమార్ యాదవ్ స్పష్టం చేశారు. ఆ పార్టీతో కలవడం కంటే చనిపోయిందని నయం అని అన్నారు. తమ పార్టీలో బీజేపీ కూటమిలో ఉన్నప్పుడు ఆ పార్టీకి ముస్లి ఓట్లతో పాట తమ మద్దతుదారుల ఓట్లు కూడా పడేవని అన్నారు. 

గర్భాశయ చికిత్స కోసం వెళితే రెండు కిడ్నీలు కాజేసి వైద్యులు పరార్.. డాక్టర్ల రూపంలో బిహార్ దొంగలు

వచ్చే ఏడాది రాష్ట్రంలోని 40 లోక్‌సభ స్థానాలకు గాను 36 స్థానాలు గెలుస్తామని బీజేపీ చెబుతోందని దుయ్యబట్టారు. డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్, అతడి తండ్రి లాలూ ప్రసాద్‌పై నిరాధార అవినీతి కేసులను వల్ల తాను 2017లో ఎన్‌డీఏలోకి తిరిగి వచ్చి తప్పు చేశానని అన్నారు. అటల్ బిహారీ వాజ్ పేయి, ఎల్ కే అద్వానీ ఉన్న సమయంలో బీజేపీ వేరుగా ఉండేదని, కానీ ఇప్పుడు పూర్తిగా మారిపోయిందని విమర్శించారు.

భారత్ జోడో యాత్ర ఎన్నికల్లో గెలుపు కోసం కాదు.. దేశాన్ని ఏకం చేసేందుకు - కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే

తాము అటల్ బిహారీ వాజ్ పేయి అభిమానులమని అన్నారు. అందులో బీజేపీతో 2017లో జతకూడమని అన్నారు. అయితే ఆ సమయంలో బీజేపీ తమ కంటే ఎక్కువ స్థానాల్లో గెలుపొందిందని చెప్పారు. అందుకే ఆ పార్టీ నాయకులనే సీఎం సీటులో కూర్చోవాలని కోరానని అన్నారు. కానీ వారే తనను బలవంతంగా సీఎం చేశారని గుర్తు చేశారు. ఆ తరువాత తమ నాయకుల ద్వారా తాము ఎన్నికల్లో ఎలా ఓటమికి గురయ్యామో తెలిసిందని అన్నారు. మా మద్దతు దారులు వేసిన ఓట్లతోనే ఆ పార్టీ నాయకులు గెలుపొందారు. మళ్లీ ఎన్నికలు వస్తే బిహారీలు అంటే ఆ పార్టీకి తెలుస్తుందని చెప్పారు.

శ్రీన‌గ‌ర్ లో జెండాను ఆవిష్కరించిన రాహుల్ గాంధీ.. 4080 కిలో మీట‌ర్ల ప్రయాణంతో భారత్ జోడో యాత్రకు ముగింపు

కాగా.. 2019లో బీహార్ లో జరిగిన ఎన్నికల్లో నితీష్ కుమార్ యాదవ్ పార్టీ అయిన జేడీయూ బీజేపీతో పొత్తు పెట్టుకొని పోటీ చేసింది. అనంతరం ఈ కూటమి అధికారంలోకి వచ్చింది. అయితే గతేడాది ఆ రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు హారిపోయాయి. దీంతో ఆ పార్టీ బీజేపీతో తెగదింపులు చేసుకుంది. తరువాత లాలూ ప్రసాద్ యాదవ్ పార్టీ అయిన ఆర్జేడీ, కాంగ్రెస్ తో కలిసి మహాఘట్ బంధన్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. 

హేతువాది నరేంద్ర దభోల్కర్ హత్య కేసులో విచారణ పూర్తి - బాంబే హైకోర్టుకు తెలిపిన సీబీఐ

జేడీయూ చీఫ్ నితీష్ కుమార్ యాదవ్ సీఎంగా బాధ్యతలు చేపట్టగా.. ఆర్జేడీ నాయకుడు తేజస్వీ యాదవ్ డిప్యూటీ సీఎంగా పదవిని అధిరోహించారు. ఇక అప్పటి నుంచి జేడీయూ, బీజేపీ పరస్పరం విమర్శలు చేసుకుంటున్నాయి. ఇదిలా ఉండగా.. ఇక జేడీయూతో కూడా పొత్తు పెట్టుకోకూడదని బీజేపీ తీర్మానం చేసింది. 

Follow Us:
Download App:
  • android
  • ios