చనిపోయాడనుకున్న వ్యక్తి రాసిన ఓ లేఖ ఇప్పుడు బీహార్ లో కలకలం రేపుతోంది. తాను బతికేఉన్నానని.. పెళ్లి చేసుకుని భార్యతో ఉన్నానని చెబుతూ ఓ వ్యక్తి ముఖ్యమంత్రికి, డీపీపీకి లేఖ రాశాడు,  

బీహార్ : చనిపోయారు అనుకున్న వ్యక్తులు.. సడన్ గా తాము బతికే ఉన్నామంటూ తిరిగి వస్తే ఎలా ఉంటుంది.. నమ్మాలో, నమ్మకూడదో.. కలో, నిజమో తెలియని పరిస్థితి. ఇక.. ఇది కనక పోలీసు కేసుల విషయంలో అయితే.. క్లోజ్ అయిన కేసును తిరిగి తోడడం.. అప్పుడు ఎందుకు కేసు క్లోజ్ అయింది.. అతను ఎలా బతికి ఉన్నాడు.. ఏం జరిగింది అనే మరో అంతుపట్టని సమస్యలకు దారితీస్తుంది. ఇలాంటి ఘటనే బీహార్లో తాజాగా వెలుగు చూసింది. ఆరు నెలల క్రితం చనిపోయిన ఓ వ్యక్తి తాను బతికే ఉన్నానని తనకు పెళ్లి కూడా అయ్యిందంటూ బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కు, డీజీపీకి, పోలీస్ స్టేషన్ కి ఉత్తరం రాశాడు.

ఆ వ్యక్తి మీద ఆరు నెలల క్రితం మిస్సింగ్ కేసు నమోదయింది. అతను చనిపోయాడని, అతని పేరు సోనూ శ్రీవాస్తవ్ గా గుర్తించారు. అయితే, అతను ఇప్పుడు స్వయంగా తాను బతికే ఉన్నానంటూ లేఖ రాయడం కలకలం రేపుతోంది. పాట్నాలోని ఓ కుటుంబం సోను శ్రీనివాసరావు అనే 30 ఏళ్ల వ్యక్తి కనిపించడం లేదంటూ రిపోర్ట్ ఇచ్చినట్లుగా పోలీసుల రికార్డుల్లో నమోదయింది. ఇంటికి కావలసిన వస్తువులు కొనడానికి వెళ్లిన సోను.. తిరిగి రాలేదంటూ తండ్రి ఫిర్యాదు చేశాడు. 

మహిళల వస్త్రధారణ మీద సల్మాన్ ఖాన్ వివాదాస్పద వ్యాఖ్యలు.. ఏమన్నారంటే...

తండ్రి ఫిర్యాదు మేరకు తమ పోలీసు కేసు నమోదు చేసుకున్నామని ఉదయ్ కుమార్ సింగ్ అనే పోలీస్ అధికారి చెప్పారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా.. తండ్రి ఫిర్యాదు చేసిన రెండు రోజుల తర్వాత.. గొంతుకోసిన మృతదేహం ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. అవి చూసిన కుటుంబ సభ్యులు.. అది తప్పిపోయిన తమ కొడుకు సోను దేనిని చెప్పారు. దీంతో.. ఆ మిస్సింగ్ కేసును కిడ్నాప్ కం హత్య కేసుగా మార్చి దర్యాప్తు చేయడం ప్రారంభించారు.

అతను ఏ రోజైతే కనిపించకుండా పోయాడని తెలిపారో... ఆరోజు చివరి ఫోన్ కాల్ లోకేషన్ ట్రేస్ చేసి హంతకులను పట్టుకోవడానికి ప్రయత్నించాం. కానీ సాధ్యం కాలేదు. అలా సోను శ్రీనివాసరావు మిస్సింగ్ కేసు చిక్కుముడి వీడలేదని ఉదయ్ సింగ్ చెప్పుకొచ్చారు. దీంతో పోలీసులు కూడా అతను చనిపోయాడని నమ్మారు. ఇది జరిగిన తర్వాత ఎన్ని రోజులకు సోను శ్రీ వాస్తవ్ లేఖ రాయడం ఒకసారిగా అధికారులను నిర్ధాంత పోయేలా చేసింది. చనిపోయాడు అనుకుంటున్న సోను శ్రీవాస్తవ్ ఆ ఉత్తరంలో తాను భార్యతో కలిసి ఉత్తర్ ప్రదేశ్ లో ఉంటున్నానని పేర్కొన్నాడు.

ఇంకా ఆ లేఖలో తన గురించిన వివరాలు చెబుతూ.. తను ఇంటికి కావలసిన వస్తువులు కొనుక్కురావడానికి రూ. 50,000 తీసుకుని బయలుదేరానని.. ఆ తర్వాత బస్సు ఎక్కి వచ్చేసానని తెలిపాడు. అంతేకాదు తన ఉత్తరంతో పాటు.. తనకు వివాహం అయినట్టుగా తెలిపే సాక్షాధారాలను కూడా జత చేశాడు. తన పేరుతో కిడ్నాప్ కం మర్డర్ కేసు ఉండడం సరికాదని చెప్పుకొచ్చాడు. ఇదే విషయాన్ని పోలీసులు సోను కుటుంబానికి తెలియజేశారు. దీనిమీద దర్యాప్తు ప్రారంభించారు.