మధ్యప్రదేశ్ రాష్ట్రం ఖాండ్వా జిల్లా కొట్ఖేడి గ్రామంలో ముగ్గురు యువతులు అనుమానాస్పద స్థితిలో చెట్టుకు వేలాడుతూ కనిపించారు. అయితే వీరు ఆత్మహత్య చేసుకున్నారా లేక ఎవరైనా హత్య చేసి సూసైడ్‌గా చిత్రీకరించే ప్రయత్నం చేశారా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు
మధ్యప్రదేశ్‌లో (madhya pradesh) దారుణం జరిగింది. ఖాండ్వా జిల్లాలోని కొట్ఖేడి గ్రామంలో ముగ్గురు యువతులు అనుమానాస్పద స్థితిలో చెట్టుకు వేలాడుతూ కనిపించారు. బాధితులు ముగ్గురు స్వయానా తోబుట్టువులు కావడం అనుమానం కలిగిస్తోంది. వీరిని సోనూ, సావిత్రి, లలితగా గుర్తించారు. వీరు ముగ్గురు చెట్టుకు వేలాడుతూ కనిపించినట్లు సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. అనంతరం వీరి మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అయితే వీరు ఆత్మహత్య చేసుకున్నారా లేక ఎవరైనా హత్య చేసి సూసైడ్‌గా చిత్రీకరించే ప్రయత్నం చేశారా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. మరణించిన అక్కాచెల్లెళ్లకు తల్లి, మరో ఇద్దరు అక్కాచెల్లెళ్లు, ముగ్గురు సోదరులు వున్నట్లుగా తెలుస్తోంది.
