మహిళా కానిస్టేబుల్ కూతురిపై డిసిపి అత్యాచారం

DCP booked for allegedly raping daughter of woman constable in Maharashtra
Highlights

ఉద్యోగం ఇప్పిస్తానని ఆశ చూపి....

మహిళలకు రక్షణగా ఉండాల్సిన ఓ పోలీసు ఉన్నతాధికారే ఓ యువతిపై దారుణానికి ఒడిగట్టాడు. అదీ తాను సనిచేస్తున్న పోలీస్ శాఖలోనే పనిచేసే ఓ మహిళా కానిస్టేబుల్ కూతురిపై. ఈ దుర్ఘటన మహారాష్ట్ర లో చోటుచేసుకుంది. 

మహారాష్ట్రలోని ఔరంగాబాద్ జిల్లాలో ఓ మహిళ కానిస్టేబుల్ గా పనిచేస్తోంది.  ఆమె 23 ఏళ్ల వయసున్న కూతురు ఉంది. ఈమె కు ఉద్యోగం ఇప్పిస్తానని ఔరంగాబాద్ జోన్ 2కు చెందిన డిసిపి రాహుల్ శ్రీరామే ఆ మహిళా కానిస్టేబుల్ కు నమ్మబలికాడు.

దీంతో ఏదో పని ఉందని సదరు మహిళా కానిస్టేబుల్ కూతురిని ఒంటరిగా తన ఇంటికి రమ్మనేవాడు. ఇలా వెళ్లిన ఆమెను బెదిరించి పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇలా గత పిబ్రవరి నుండి ఇప్పటివరకు అతడు ఈ యువతిపై అనేకసార్లు బలత్కారానికి పాల్పడ్డాడు.

 ఈ దారుణానికి పాల్పడిన వ్యక్తి ఓ పోలీస్ ఉన్నతాధికారి కావడంతో ఈ విషయాన్ని యువతి బైటపెట్టలేదు. అయితే ఈ మద్య అతడి వేధింపులు మరీ ఎక్కువవడంతో భరించలేక స్థానిక పోలీసులకు అతడిపై ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు ఈ దారుణానికి పాల్పడిన డిసిపిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు.

 


 

loader