ఛత్తీస్ ఘడ్ సీఎం భూపేశ్ బఘేల్ బీజేపీపై తీవ్ర విమర్శలు చేశారు. బీజేపీకి సీనియర్ నేతలు కూతుర్లు ముస్లింలను పెళ్లి చేసుకున్నారని, కానీ దానిని వారు లవ్ జిహాద్ అని పిలవరని అన్నారు. వేరే వాళ్లు చేస్తే మాత్రం లవ్ జిహాద్ అంటూ వ్యాఖ్యానిస్తారని చెప్పారు. 

బీజేపీ తరచూ లవ్ జిహాద్ అంశాన్ని లేవనెత్తుతుందని, కానీ కాషాయ పార్టీ సీనియర్ నేతల కూతుళ్లు ముస్లింలను పెళ్లి చేసుకున్నారని ఛత్తీస్ ఘడ్ సీఎం భూపేశ్ బఘేల్ అన్నారు. అయితే దానిని వారు ప్రేమ అని పిలుస్తున్నారని, వేరే వాళ్లు చేస్తే దానిని ‘జిహాద్’ అంటారని తెలిపారు. బెనెతారా జిల్లాలోని బీరాన్ పూర్ గ్రామంలో గత వారం జరిగిన మతఘర్షణల నేపథ్యంలో ముఖ్యమంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. కాగా.. కొన్ని మతాంతర వివాహాల కారణంగా గ్రామంలో ఘర్షణలు చెలరేగాయని బీజేపీ ఆరోపించింది.

దేశం కోసం కలిసి నిలబడతాం.. ప్రతిపక్షాలు ఏకం కావడం చారిత్రాత్మక చర్య - కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ

బిలాస్ పూర్ లో మీడియాతో మాట్లాడిన సీఎం భూపేశ్ బఘేల్.. బీరాన్ పూర్ లో జరిగిన మత హింసను రాజకీయంగా లబ్ది పొందేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ‘‘బంద్ కు పిలుపునిచ్చే ముందు బీజేపీ ఈ విషయాన్ని (ఘర్షణ) పరిశీలించలేదు. లేదా ఎలాంటి నివేదిక ఇవ్వలేదు. ఇద్దరు పిల్లల మధ్య మొదలైన గొడవ ఘర్షణకు దారి తీసింది. ఈ ఘటనలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోవడం చాలా బాధాకరం. దీన్ని సమర్థించలేం. కానీ బీజేపీ మాత్రం తన పొలిటికల్ మైలేజ్ కోసం ప్రయత్నిస్తోంది.’’ అని అన్నారు.

ఇవేం ఎండలు బాబోయ్.. భానుడి ప్రతాపానికి అహ్మదాబాద్ లో కరిగిన రోడ్డు.. అవస్థలు పడ్డ ప్రయాణికులు..ఫొటోలు వైరల్

‘‘లవ్ జిహాద్ గురించి మాట్లాడుతున్నారు. ఇక బీజేపీ సీనియర్ నేతల విషయానికొస్తే వారి కూతుళ్లు ముస్లింలను పెళ్లి చేసుకున్నారు. ఇది లవ్ జిహాద్ కోవలోకి రాదా? చత్తీస్ గఢ్ లో బీజేపీకి చెందిన అతి పెద్ద నాయకుడి కూతురు ఎక్కడికి వెళ్లారు. ఇది లవ్ జిహాద్ కాదా? తమ కూతురు అలా చేస్తే అది ప్రేమ అని, మరెవరైనా చేస్తే అది జిహాద్ అంటున్నారు.’’ అని భూపేష్ బఘేల్ వ్యాఖ్యానించారు. 

ప్రధాని మోడీకి ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ లేఖ.. మానవతా సాయం చేయాలని అభ్యర్థన..

లవ్ జిహాద్ ను ఆపడానికి బీజేపీ ఏం చేసిందని ప్రశ్నించిన బఘేల్. దాని ద్వారా రాజకీయ లబ్ధి పొందాలని మాత్రమే ఆ పార్టీ కోరుకుంటోందని అన్నారు. తమ అల్లుడిని మంత్రిని, ఎంపీలను చేసి వేరే చట్టాల కింద ఇతరులను ట్రీట్ చేస్తున్నారన్నారు.

కర్ణాటక ఎన్నికల్లో కీలక పరిణామం.. బీజేపీకి గుడ్ బై చెప్పిన మాజీ డిప్యూటీ సీఎం లక్ష్మణ్ సవది.. ఎందుకంటే ?

బీరాన్ పూర్ లో మత ఘర్షణ
ఏప్రిల్ 8వ తేదీన పాఠశాల విద్యార్థుల మధ్య జరిగిన గొడవతో బీరాన్ పూర్ లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ఘర్షణలో ఓ స్థానికుడు మృతి చెందగా, ముగ్గురు పోలీసులు గాయపడ్డారు. హింస జరిగిన మూడు రోజుల తర్వాత బీరాన్ పూర్ కు చెందిన ఇద్దరు ముస్లిం యువకులు గ్రామానికి కొన్ని కిలోమీటర్ల దూరంలో తలకు గాయాలతో శవమై కనిపించారు.