చిన్నపాటి గొడవకే ఓ యువతి కన్న తల్లిని అతి కిరాతకంగా హత్య చేసింది ఈ దారుణ సంఘటన కర్ణాటక రాష్ట్రంలో చోటుచేసుకుంది. నవ మాసాలు మోసి కని పెంచి... కష్టపడి చదివిస్తున్న తల్లిని ఆమె అత్యంత కిరాతకంగా హత్య  చేయడం స్థానికంగా కలకలం రేపింది. తల్లిని చంపేందుకు సదరు యువతికి ఆమె సోదరుడు కూడా సహకరించినట్లు  తెలుస్తోంది.

Also Read దారుణం.. నడిరోడ్డుపై మహిళా లెక్చరర్ పై పెట్రోల్ పోసి...

పూర్తి వివరాల్లోకి వెళితే... బెంగళూరు నగరం కేఆర్ పురంలోని అక్షయ నగర్ కి చెందిన మహిళ నిర్మల(55) భర్త చనిపోయాడు. దీంతో ఆమె కుమార్తె అమృత, కొడుకుతో కలిసి జీవిస్తోంది. కాగా... తల్లీ కూతుళ్ల కు నిత్యం ఏదో ఒక విషయంలో గొడవలు జరుగుతూ ఉంటాయి, ఈ నేపథ్యంలో  ఆదివారం రాత్రి కూడా తల్లీ కూతుళ్లు గొడవ పడ్డారు.

అనంతరం నిర్మల తన గదిలోకి వెళ్లి నిద్రపోయింది. అయితే తల్లి తనను తిట్టడాన్ని అమృత జీర్ణించుకోలేకపోయింది. తల్లి నిద్రపోతుండగా కత్తి తీసుకొని పొడిచి హత్య చేసింది. అనంతరం ఇంట్లో నుంచి పరారయ్యింది. ఆ సమయంలో నిర్మల కొడుకు కూడా ఇంట్లోనే ఉన్నట్లు తెలుస్తోంది. తల్లి హత్య తర్వాత అతను కూడా పరారయ్యాడు. అయితే... ఈ హత్య కేసులో అతని హస్తం కూడా ఉందా అని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు.