గుజరాత్‌లోని సూరత్‌లో ఆస్తి కోసం ఓ మహిళ తన అత్తపై శారీరకంగా దాడి చేసి, ఆమెకు కొరికిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
గుజరాత్ : గుజరాత్ లో వెలుగు చూసిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. జూన్ నెల ప్రారంభంలో వెలుగు చూసిన ఈ వీడియోలో ఓ కోడలు అత్తమీద పడి కరుస్తోంది. ఆస్తి కోసం అత్తను కొట్డడమే కాకుండా.. ఆమె మీద పడి కరిచింది. ఈ వీడియోను బాధితురాలి కొడుకు పోలీసులకు ఫిర్యాదు చేస్తూ.. పోస్ట్ చేశాడు.
గుజరాత్, సూరత్‌లో ఈ నెల ప్రారంభంలో ఆస్తి వివాదం విషయంలో ఓ మహిళ తన వృద్ధ అత్తపై దాడి చేసి, కొరికింది. బాధితురాలి కుమారుడు ఈ ఘటనను చిత్రీకరించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ వీడియో కలవరపరిచింది. వీడియో ఆమె ఇద్దరు పిల్లలు సోఫాలో కూర్చుని ఉండడం కనిపిస్తుంది.
కుటుంబంలో ఐదుగురిని చంపి, తాను ఆత్మహత్య చేసుకున్నడాక్టర్.. ఏడేళ్ల తరువాత మిస్టరీ రివీల్..
ఆస్తి గొడవ చిలికి చిలికి గాలివానగా మారడంతో కోడలు, అత్తగారి మధ్య తీవ్ర వాగ్వాదం పెరిగి హింసాత్మకంగా మారింది. సంఘటన మొత్తం, బాధితురాలి భర్త కోడలి దాడి నుండి ఆమెను రక్షించడానికి ప్రయత్నిస్తున్నాడు.
నిందితురాలు ఇప్పటికే సూరత్‌లోని ఒక ఆస్తిని తన పేరు మీదికి మార్చుకుందని, ఇప్పుడు గ్రామంలోని మరొక ఆస్తిని కూడా అదే విధంగా చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు పోలీసులు దర్యాప్తులో గుర్తించారు. ఆమె తన భర్త, అత్తవారిపై వరకట్నం కేసు కూడా పెట్టింది. ఆస్తి కోసం తమ ఇంట్లో ఉన్న అత్తగారిపై శారీరకంగా దాడికి దిగింది. ప్రస్తుతం పోలీసులు ఈ అంశంపై మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.
