బాధితురాలు పళనియమ్మాళ్‌కు రోజూ ఉదయం కోడలు వేడి వేడిగా టీ ఇస్తుంది. అయితే ఘటన జరిగిన రోజు ఉదయం ఇచ్చిన టీ వేడిగా లేకపోవడంతో ఇద్దరిమధ్య చెలరేగిన వాగ్వాదం ఈ దారుణానికి దారి తీసింది. 

తమిళనాడు : తమిళనాడులోని పుదుక్కొట్టైలో ఓ దారుణ ఘటన వెలుగు చూసింది. హత్య కేసులో అక్కడి స్థానిక పోలీసులు ఓ మహిళను అరెస్టు చేశారు. సొంత అత్తను దారుణంగా హతమార్చిన కేసులో ఆమెను అదుపులోకి తీసుకున్నారు. తనకు ఇచ్చిన ఛాయ్ చల్లగా ఉందని అన్నందుకు అత్తను క్షణికావేశంలో ఇనుపరాడ్ తో తల మీద కొట్టి హతమార్చింది ఆమె. తమిళనాడులోని పుదుకొట్టైజిల్లా వైరాలి మలాలై లోని ఓ గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. నిందితురాలిని గనుకుగా గుర్తించారు. దీనికి సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.

గనుకుకు వైరాలి మలాలైలోని సైకిల్ రిపేర్ షాప్ యజమాని అయిన ఓ వ్యక్తి తో వివాహమైంది. ఆ తర్వాత ఆమె భర్త, అత్తలతో కలిసి వైరాలి మలాలై లోనే ఒకే ఇంట్లో ఉంటున్నారు. నిందితురాలికి కొంత మానసిక సమస్య ఉన్నట్లుగా తెలుస్తోంది. దీనికి ఆమెకు చికిత్స చేయిస్తున్నారు కుటుంబ సభ్యులు. ఈ ఉదంతాం జరగడానికి ముందు రెండు రోజులుగా ఆమె మందులు తీసుకోవడం లేదని తెలుస్తోంది. దీంతో మానసికంగా కాస్త అస్థిరంగా ఉందని సమాచారం. 

స్కూల్ టాయిలెట్ లో బాలికలపై లైంగికదాడి.. పైకప్పు విరగ్గొట్టి...లోపలికి దూరి.. దారుణం..

బాధితురాలను ఫళనీయమ్మాల్ గా గుర్తించారు. ప్రతిరోజు ఉదయం అత్త ఫళనీయమ్మాల్ కు ఆమె కోడలు గనుకు వేడివేడిగా టీ పెట్టి ఇస్తుంది. గురువారం ఉదయం కూడా అలాగే టీ పెట్టి ఇచ్చింది. అయితే, టీ వేడిగా లేకపోవడంతో... చల్లారిపోయిందని కోడలితో అంది. దీంతో అత్తతో వాగ్వాదానికి దిగింది గనుకు. కోడలి మీద అత్త గట్టిగా కేకలు వేసింది. దీంతో కోడలు కోపంతో ఊగిపోయింది. దీనికి తోడు రెండు రోజులుగా ఆమె మందులు వేసుకోకపోవడం కూడా సమస్య తీవ్రతకు కారణమైంది. 
పూర్తిగా విచక్షణ కోల్పోయిన ఆమె క్షణికావేశంలో సైకిల్ రిపేర్ షాప్ లో ఉన్న ఐరన్ రాడ్ ను తీసుకుని అత్త తల మీద దాడి చేసింది. ఇది గమనించినవారు వెంటనే అత్త ఫళనీయమ్మాల్ ను చికిత్స కోసం వైరాలి మలాలై ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. గాయాలు తీవ్రం కావడంతో ఆసుపత్రికి వెళ్లేలోపే ఆమె మరణించింది. మలైక్కుడిపట్టికి చెందిన వేల్, పళనియమ్మాళ్ దంపతులకు ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. ఫళనీయమ్మాల్ కొడుకు దగ్గర ఉంటుంది.