Asianet News TeluguAsianet News Telugu

దారుణం : భర్తమీద కోపంతో.. మామ మర్మాంగాన్ని కోసేసిన కోడలు..

భర్తమీద పట్టరాని కోపంతో అత్తామామలతో గొడవకు దిగిందో భార్య. వాగ్వాదం ముదరడంతో మామ మర్మాంగాన్ని కత్తితో కోసి పడేసింది.

daughter-in-law cut her uncle's private part over anger on her husband in west bengal
Author
First Published Sep 29, 2022, 7:51 AM IST

పశ్చిమ బెంగాల్ : పశ్చిమబెంగాల్లోని మైనా జిల్లాలో పుట్టింటికి వెళ్లొద్దన్నారన్న కోపంతో ఒక మహిళ తన మామ మర్మాంగాలను కోసి పడేసింది. తూర్పు మేదినీపూర్ పోలీస్స్టేషన్ పరిధికి చెందిన శిఖా అనే మహిళకు వివాహం అయ్యింది. భర్త, అత్తామామలతో కలిసి ఉంటోంది. అయితే ఒక రోజు ఆమెకు తండ్రి ఫోన్ చేసి.. ఇంట్లో నాన్ వెజ్ వండామని భోజనం చేసేందుకు రమ్మని పిలిచాడు. దీంతో వెంటనే ఆమె తన భర్తకు కాల్ చేసి విషయం చెప్పింది. కానీ, అతను వెళ్లొద్దని చెప్పాడు. 

తానే చికెన్ తెస్తానని… ఇంట్లోనే వండుకుని అందరం తిందామని తెలిపాడు. దీంతో కోపంతో కాల్ కట్ చేసిన ఆ మహిళ.. ఇదే విషయంగా తన అత్తమామల మీద తీవ్రంగా కోపం ప్రదర్శించింది. దీంతో అది కాస్త వాగ్వాదానికి దారితీసింది. అత్తామామల్ని తీవ్రంగా దూషించిన కోడలు.. కోపంతో ఊగిపోయింది. విచక్షణ కోల్పోయి తన మామ మర్మాంగాన్ని కత్తితో కోసి పడేసింది. ఈ గొడవతో అక్కడికి చేరుకున్న స్థానికులు వెంటనే అతడిని ఆస్పత్రిలో చేర్పించారు. మహిళను ఇంట్లో బంధించారు. అయితే, ఆమె విడిపించుకుని కన్నవారింటికి పారిపోయింది. నిందితురాలిని అరెస్ట్ చేసిన పోలీసులు ఆమెను కోర్టులో హాజరుపరిచారు.

దొంగబాబాల మాట నమ్మి.. సజీవసమాధిలోకి వెళ్లిన యువకుడు.. పోలీసులు రావడంతో..

ఇదిలా ఉండగా, ఇలాంటి ఘటనే చత్తీస్ ఘడ్ లో మంగళవారం చోటు చేసుకుంది. అందంగా లేవు.. నల్లగా ఉన్నావ్ అంటూ.. భర్త.. భార్య మీద వేధింపులకు పాల్పడుతున్నాడు.  విసిగిపోయిన భార్య.. భర్తను గొడ్డలితో నరికి హత్య చేసింది. ఈ క్రమంలో అతడి మర్మాంగాన్ని కోసేసింది. చత్తీస్ ఘడ్ లోని దుర్గ్ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇక్కడి అమలేశ్వర్ గ్రామంలో అనంత్ (40), సంగీత దంపతులు నివసిస్తున్నారు. నల్లగా ఉన్నావు, అందంగా లేవు అంటూ అతను తన భార్యను తరచూ వేధించేవాడు. ఈ విషయమై ఇద్దరి మధ్య పలుమార్లు గొడవలు జరిగాయి. ఆదివారం సైతం భార్య భర్తల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది.

ఈ క్రమంలోనే తీవ్ర ఆగ్రహానికి గురైన భార్య, ఇంట్లోని గొడ్డలితో భర్తపై దాడి చేసింది. తీవ్ర గాయాలతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. ఆ తర్వాత.. ఆమె తన భర్తను ఎవరో హత్య చేశారంటూ  గ్రామస్తులను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నించింది. చివరికి..  పోలీసుల విచారణలో నేరం అంగీకరించింది. ఈ మేరకు కేసు నమోదు చేసి, నిందితురాలిని అరెస్ట్ చేసినట్లు స్థానిక పోలీసు అధికారి దేవాన్ష్ రాథోడ్ మంగళవారం వెల్లడించారు. మృతుడి భార్య చనిపోవడంతో అతను రెండో వివాహం చేసుకున్నట్లు తెలిపారు.

నిందితురాలు సంగీతకు, మృతుడు అనంత్ సొన్వానికి చాలా కాలం కిందట పెళ్లయింది. సంగీత అనంత్ కు రెండో భార్య. మొదటి భార్య అనారోగ్యంతో చనిపోయింది. మొదటి భార్య సంతానంగా కలిగిన కొడుకు.. సంగీత బిడ్డ, అనంత్.. అంతా ఒకే ఇంట్లో కలిసి ఉంటున్నారు. పెళ్లైన నాటినుంచే భర్త ఆమె రంగును ప్రస్తావిస్తూ వేధించేవాడు. 

Follow Us:
Download App:
  • android
  • ios