దళితులకు బీజేపీలో ఎదుగుదల ఉండదు - సొంత పార్టీపై కర్ణాటక ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు
బీజేపీలో దళితులకు ఎదుగుదల ఉండదని ఆ పార్టీ ఎంపీ రమేష్ జగజీనాగి ఆరోపించారు. కానీ ఇది చాలా దురదృష్టకరమని అన్నారు. కర్ణాటక బీజేపీ అధ్యక్షుడిని తొలగించి, యడియూరప్ప కుమారుడికి ఆ పదవికి కట్టబెట్టిన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
దళితులకు బీజేపీలో ఎదుగుదల ఉండదని ఆ పార్టీకి చెందిన ఎంపీ రమేష్ జగజీనాగి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యడియూరప్ప కుమారుడు బీవై విజయేంద్రను రాష్ట్ర బీజేపీ శాఖ అధ్యక్షుడిగా హైకమాండ్ నియమించిన కొద్ది రోజులకే ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు బుధవారం రమేష్ జగజీనాగి బుధవారం మీడియాతో మాట్లాడారు.
ఇసుక రవాణాను అడ్డుకున్నాడని ఎస్ఐని గుద్ది చంపిన ట్రాక్టర్ డ్రైవర్.. మరో పోలీసుకు గాయాలు..
బీజేపీలో ధనిక నాయకులు లేదా గౌడలు (వొక్కలిగలు) ఉంటే ఆదరణ లభిస్తుందని అన్నారు. కానీ దళితుడు అయితే మాత్రం ఎవరూ సపోర్ట్ చేయరని ఆరోపించారు. ఇది తమకు తెలిసని అన్నారు. ఇది చాలా దురదృష్టకరమని చెప్పారు. యడ్యూరప్ప కుమారుడు కాబట్టే బీవై విజయేంద్రను పార్టీ అధిష్టానం రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించిందని విమర్శించారు.
viral video : బైక్ కు పటాకులు కట్టి ప్రమాదకరమైన స్టంట్స్.. వీడియో వైరల్.. నెటిజన్ల ఆగ్రహం
ఇదిలా ఉండగా.. ఇటీవల కర్ణాటక బీజేపీ కర్ణాటక అధ్యక్షుడిగా కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యడియూరప్ప కుమారుడు, షికారిపుర ఎమ్మెల్యే బీవై విజయేంద్రను ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నియమించారు. ఆయన రేపు (నవంబర్ 15న) అధికారికంగా కర్ణాటక బీజేపీ శాఖ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. నళిన్ కుమార్ కటీల్ స్థానంలో విజయేంద్ర బాధ్యతలు చేపట్టనున్నారు.