రాజస్తాన్‌లో దారుణం జరిగింది. చురుకు చెందిన రాకేశ్ అనే 25 ఏళ్ల యువకుడి ఇంటికి 26వ తేదీ అర్ధరాత్రి కొందరు దుండుగులు ప్రవేశించారు. అదే రాత్రి కిడ్నాప్ చేసుకుని పొలాల్లోకి వెళ్లిపోయారు. అనంతరం, ఆ దుండగులు రాకేశ్‌ను చితకబాదారు. అక్కడే వారంతా మద్యం తాగారు. అనంతరం, వారు అదే బాటిల్‌లో మూత్రం నింపారు. ఆ మూత్రాన్ని రాకేశ్‌తో తాగించిన అమానుష ఘటన రాజస్తాన్‌లో ఆలస్యంగా వెలుగు చూసింది.
జైపూర్: ఊరి పొలిమేరల్లో జీవిస్తున్నవారు ఎక్కడ ధిక్కారం చూపించినట్టు కనిపించినా.. అమానుష ధోరణిలో వారిపై అకృత్యాలకు పాల్పడుతున్న ఘటనలు ఇంకా చోటుచేసుకుంటూనే ఉన్నాయి. కేవలం తమ ఆధిపత్యాన్ని చాటడానికి వికృతాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి ఆధిపత్యాలు, వివక్షలు, ముఖ్యంగా దళితులు, వెనుకబడినవర్గాలపై ఎక్కువగా జరుగుతాయి. అవి కూడా చాలా వరకు ఉత్తర భారతంలోనే మనం చూస్తూ ఉంటాం. తాజాగా, అలాంటి ఘటనే ఒకటి రాజస్తాన్‌లో వెలుగులోకి వచ్చింది.
రాజస్తాన్(Rajasthan)లోని చురులోని రుఖాసర్ గ్రామానికి చెందిన 25 ఏళ్ల రాకేశ్ మేఘవాల్‌ను కొందరు దుండగులు ఇంటికి వచ్చి బెదిరించారు. అర్ధరాత్రి ఇంటి నుంచి కిడ్నాప్(Kidnap) చేసి పట్టుకెళ్లారు. పొలాల్లోకి లాక్కెళ్లారు. ఆ తర్వాత అక్కడ రాకేశ్‌పై విచక్షణారహితంగా దాడి(Attack) చేశారు. చితక్కొట్టిన తర్వాత పక్కనే ఉంచుకుని వారంతా మద్యం సేవించారు. ఆ తర్వాత అదే బాటిల్‌లో మూత్ర విసర్జన చేశారు. ఆ బాధితుడి దగ్గరకు వెళ్లి అమానుషంగా అతనితో మూత్రం తాగించారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
వీరి మధ్య పాత కక్ష్యలు ఉన్నట్టు తెలిసింది. ఈ నెల 26వ తేది ఈ ఘటన జరిగినట్టు సమాచారం. ఆ రోజు రాత్రి 11 గంటల ప్రాంతంలో ఆ దుండగులు రాకేశ్‌ను ఇంటి నుంచి అపహరించుకుపోయారు. ఆ తర్వాత బలవంతంగా అతనితో మూత్రం తాగించారు. ఇది కేవలం వారి ఆధిపత్యం చూపించుకోవడానికే ఈ దుశ్చర్యకు పాల్పడినట్టు అనుమనిస్తున్నారు. ఈ విషయం కూడా బయటకు రాలేదు. కానీ, రాకేశ్ చివరకు పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది.
రాకేశ్ మేఘవాల్ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఎనిమిది మందిపై కేసు పెట్టారు. ప్రస్తుతం ఉమేశ్, బీర్బల్ అనే ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేసినట్టు తెలిపారు. మిగతా నిందితులు పరారీలో ఉన్నారు. వారి కోసం గాలింపులు జరుపుతున్నట్టు అధికారులు తెలిపారు. ఇందుకోసం ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేసి రంగంలోకి దింపినట్టు రతన్‌గడ్ సర్కిల్ అధికారి హిమాన్షు శర్మ వెల్లడించారు.
ఇదిలా ఉండగా, ఇటీవలే Uttar pradesh లోని అమెథీలో దారుణ ఘటన చోటు చేసుకుంది. దొంగతనం అభాండం వేసి ఓ దళిత బాలికను ఓ కుటుంబం Torture పెట్టింది. ఆ అభాగ్యురాలిపై ఇష్టారీతిన దాడి చేశారు. దొంగతనం ఎందుకు చేశావంటూ.. బాలికను ఇంట్లో కింద పడుకోబెట్టి కాళ్లను ఓ stickపై పెట్టి మరో కర్రతో కొడుతూ అత్యంత కఠినంగా వ్యవహరించిన video ఒకటి వెలుగులోకి రావడం షాక్ కు గురి చేస్తోంది.
నొప్పితో బాలిక విలవిల్లాడుతూ రోదిస్తున్నా ఎలాంటి కనికరం చూపలేదు ఆ కర్కోటకులు. అక్కడే ఉన్న కొందరు మహిళలు కూడా నిందితులకు వంత పాడటం గమనార్హం. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఘటన మీద అమేఠీ ఎంపీ, మహిళా శిశు అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీ మండిపడ్డారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు.
