భోపాల్: మధ్య ప్రదేశ్ రాష్ట్రంలో అత్యంత నీచమైన, అమానవీయమైన సంఘటన చోటు చేసుకుంది. కాపాడాల్సిన కన్నతండ్రే కూతురిని కాటేశాడు. ఇందుకు సంబంధించిన వివరాలను పోలీసులు తెలిపారు. 

మధ్యప్రదేశ్ లోని మొరెనా జిల్ాలలో 18 ఏళ్ల బాలికపై కన్నతండ్రి అత్యాచారం చేశాడు. లాక్ డౌన్ వేళ ఇంట్లోనే ఉంటున్న కూతురిపై మార్చి 26వ తేదీన అతను అత్యాచారం చేశాడు. ఈ ఘోరానికి బాధితురాలి తల్లి తండ్రికి సహకరించినట్లు సమాచారం. 

ఆ తర్వాత బాధితురాలు ఇంటి నుంచి తప్పించుకుని పారిపోయింది. తమ బంధువుల ఇంటికి వెళ్లింది. విషయం తెలుసుకున్న బాధితురాలి తండ్రి బంధువుల ఇంటి నుంచి ఆమెను తీసుకుని వెళ్లాడు. తిరిగి ఏప్రిల్ 10వ తేదీన కూతురిపై అత్యాచారం చేశాడు. 

జరిగిన విషయం తెలుసుకున్న బాధితురాలి సోదరి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దాంతో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. బాధితురాలి తల్లిదండ్రులను అరెస్టు చేసి కోర్టులో ప్రవేశపెట్టారు.