Asianet News TeluguAsianet News Telugu

డీమార్ట్ వోచర్‌ రూ.2500 అంతా మోసం.. జాగ్రత్త..!!

డీమార్ట్ వోచర్‌ రూ.2500 అంతా  మోసం.. జాగ్రత్త..!!

D-mart Rs.2500 Gift Voucher is syber Trap

వినియోగదారులను ఆకట్టుకోవడానికి.. అమ్మకాలు పెంచుకోవడానికి పలు సంస్థలు ఆకర్షణీయమైన ఆఫర్లు ప్రకటిస్తూ ఉంటాయి.. దానిని సోషల్ మీడియాలోనూ.. మీడియాలోనూ ప్రచారం చేస్తుంటారు. అయితే పెరిగిన సాంకేతిక పరిజ్ఞానం అదే స్థాయిలో మోసాలను కూడా పెంచింది. కొందరు కేటుగాళ్లు పలు సంస్థలు ఆఫర్లు ఇస్తున్నాయని చెప్పి.. కొన్ని లింకులను మెయిల్స్‌కు.. వాట్సాప్  నెంబర్లకు.. ఫేస్‌బుక్ పేజీలకు పంపి.. మన నుంచి సమాచారాన్ని రాబడుతుంటారు.. అచ్చం అలాంటి సంఘటనే ఒకటి కొద్దిరోజుల నుంచి దేశంలోని పలు ప్రాంతాల్లో చక్కర్లు కొడుతోంది.

ప్రముఖ రిటైల్ దిగ్గజం డీమార్ట్ తన 17వ వార్షికోత్సవం సందర్భంగా రూ.2500 షాపింగ్ వోచర్‌ను ఉచితంగా ఇస్తోందని.. ఓ లింక్ వాట్సాప్ గ్రూపుల్లో షేర్ అవుతోంది... ఈ మెసేజ్ రాగానే ఓపెన్ చేస్తే... దానిలో ఈ లింకును మరో 20 మందికి షేర్ చేయాలని కనిపిస్తుంది.. వూరకే పాతిక వందలు వస్తుంటే ఎవరు మాత్రం వదిలేస్తారు చెప్పండి.. అయితే అలా చేసిన ఎవరికి ఎలాంటి సొమ్ము క్రెడిట్ అయినట్లుగా మెసేజ్ రాలేదు. దీనిపై కొందరు సైబర్ నిపుణులు లోతుగా విశ్లేషించగా... ఇది కొందరు సైబర్ మోసగాళ్ల పనిగా తేల్చారు..

వాట్సాప్ గ్రూపుల్లో కనిపిస్తున్న డీమార్ట్ లింకును క్లిక్ చేస్తే.. అది వేరే వెబ్‌సైట్‌కి రీడైరక్ట్ అవుతుంది.. అక్కడ ఎంటర్ చేసే సమాచారం.. మనం ఆ లింక్ షేర్ చేసే నంబర్లు అన్ని దుండగులకు చేరిపోతున్నట్లు నిర్థారించచారు.. ఈ లింక్.. డీమార్ట్ వెబ్‌‌సైట్ లింక్ లా ఉన్నా .. మెసేజ్‌లో చూపిస్తున్న పేజీ డీమార్ట్ ఒరిజనల్ పేజ్‌లో ఆ ఇన్ఫర్‌మేషన్ లేదు.. ఇప్పటికే ఆ లింక్ క్లిక్ చేసిన వారు భయపడాల్సిన అవసరం లేదని.. అలాంటి వారు మీ బ్యాంక్, మెయిల్ ఐడీ పాస్‌వర్డ్‌లు మార్చుకుంటే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ఇక ఈ లింక్ వ్యవహారంపై డీమార్ట్ స్పందించింది. వాట్సాప్ గ్రూపుల్లోనూ... ఇతర సోషల్ మీడియాలోనూ వస్తున్నట్లు తాము ఎలాంటి వోచర్లు.. క్యాష్ బ్యాక్ ఆఫర్లు ప్రకటించలేదని డీమార్ట్ స్పందించింది. అలాంటి వాటి పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని.. కేటుగాళ్ల బారినపడి మోసపోవద్దని సూచించింది.

Follow Us:
Download App:
  • android
  • ios