Cyclone Mocha: బంగాళాఖాతంలో తుఫాను ఏర్పడే అవకాశం ఉందని అమెరికా-యూరప్ వాతావరణ వ్యవస్థల అంచనాల నేపథ్యంలో భారత వాతావరణ శాఖ (ఐఎండీ) స్పందించింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఈ నెల 6న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందనీ, దాని ప్రభావంతో మరో 48 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. 

Weather update-Cyclone Mocha: ఆగ్నేయ బంగాళాఖాతంలో మే 6న తుఫాను ఏర్పడే అవకాశం ఉందనీ, ఫలితంగా వచ్చే 48 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది. బంగాళాఖాతంలో తుఫాను ఏర్పడుతుందని అమెరికా వాతావరణ అంచనా వ్యవస్థ గ్లోబల్ వెదర్ ఫోర్‌కాస్ట్‌ సిస్టమ్ (జీఎఫ్ఎస్), యూరోపియన్ సెంటర్ ఫర్ మీడియం రేంజ్ వెదర్ ఫోర్‌కాస్ట్‌లు (ఈసీఎండబ్ల్యూఎఫ్) అంచనా వేసిన తర్వాత ఐఎండీ ఈ ప్రకటన చేసింది.

ఐఎండీ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మాట్లాడుతూ..

ఐఎండీ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మహాపాత్ర మాట్లాడుతూ "కొన్ని వ్యవస్థలు దీనిని తుఫానుగా అంచనా వేశాయి. దీనిని పర్యవేక్షిస్తున్నాము.. మేము దీనిపై ఒక కన్నేసి ఉంచుతున్నాం. 2023 మే మొదటి పక్షం రోజుల్లో తుఫాను వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉందని ప్ర‌యివేటు వాతావరణ అంచనా సంస్థ స్కైమెట్ వెదర్ తెలిపింది. ఈ విధంగా గత నెలలో తుఫాను సంభవించకపోవడం వరుసగా ఇది నాలుగో సంవత్సరం.

'మోచా' అనే పేరు ఎందుకు..? 

అధికారికంగా ధృవీకరించబడితే, ప్రపంచ వాతావరణ సంస్థ (డబ్ల్యూఎంఓ), యునైటెడ్ నేషన్స్ ఎకనామిక్ అండ్ సోషల్ కమిషన్ ఫర్ ఆసియా అండ్ పసిఫిక్ (ఎస్కాప్) సభ్య దేశాలు అవలంబించిన నామకరణ వ్యవస్థ ప్రకారం ఈ తుఫానుకు 'మోచా' అని నామకరణం చేస్తారు. యెమెన్ తన ఎర్ర సముద్రం తీరంలోని ఓడరేవు నగరమైన మోచా పేరును ఈ తుఫానుకు సూచించారు.

ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించిన ఒడిశా సీఎం

తుఫాను ఎదుర్కొనేందుకు సన్నద్ధతపై ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ మంగళవారం ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించి ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. 2019 మే 2న ఒడిశాను తాకిన తుఫానును ప్రస్తావిస్తూ, వేసవిలో తుఫానుల మార్గాన్ని గుర్తించడం కష్టమని పట్నాయక్ అన్నారు. అవసరమైతే లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, తుఫాను అనంతర సహాయక చర్యలకు ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పీకే జెనాను, అన్ని శాఖలు, జిల్లాల సమన్వయంతో పనిచేయాలని స్పెషల్ రిలీఫ్ కమిషనర్ సత్యవ్రత్ సాహును నవీన్ పట్నాయక్ ఆదేశించారు. 

ప్రాంతీయ వాతావరణ కేంద్రం తుఫాను గురించి వివ‌రిస్తూ.. 

తుఫాను గురించి ఐఎండీ ఇంకా ఎలాంటి అంచనా వేయలేదని భువనేశ్వర్ ప్రాంతీయ వాతావరణ కేంద్రం అధికారి ఒకరు తెలిపారు. అల్పపీడనం తుఫానుగా మారకముందే లోతైన పీడన ప్రాంతంగా మారాల్సి ఉందన్నారు. 

ఏర్పాట్లపై అధికారులు సమాచారం.. 

తుఫాను రాష్ట్రాన్ని తాకితే ఎలాంటి మరణాలు సంభవించకుండా ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఈ మేరకు అన్ని జిల్లాల కలెక్టర్లను అప్రమత్తం చేశారు. తుఫాన్ షెల్టర్లు సిద్ధంగా ఉన్నాయని, పాఠశాల భవనాలతో సహా సురక్షిత ప్రదేశాలను గుర్తించామని తెలిపారు. ఇప్పటికే అన్ని జిల్లాల్లో 24 గంటల కంట్రోల్ రూంలు ఏర్పాటు చేశామన్నారు. 18 తీరప్రాంత, పరిసర జిల్లాల కలెక్టర్లను సిద్ధంగా ఉండాలని ఆదేశించామనీ, జాతీయ విపత్తు ప్రతిస్పందన దళానికి చెందిన మొత్తం 17 బృందాలు, ఒడిశా డిజాస్టర్ ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ కు చెందిన 20 బృందాలను సిద్ధంగా ఉంచామని తెలిపారు.