Asianet News TeluguAsianet News Telugu

మండూస్ తుఫాన్.. రెండు రోజులు పాటు తమిళనాడు, ఏపీలో భారీ వర్షాలకు ఛాన్స్..

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మాండూస్ తుఫానుగా మారడంతో రాబోయే రెండు రోజుల పాటు ఏపీ, తమిళనాడు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ తుఫాను ప్రభావంతో ఈదురుగాలులు వీస్తాయని కూడా చెప్పింది. 

 
 

cyclone Mandus..Chance of heavy rains in Tamil Nadu and AP for two days..
Author
First Published Dec 8, 2022, 9:50 AM IST

నైరుతి, దాని ఆనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మాండూస్ తుఫానుగా మారడంతో భారత వాతావరణ శాఖ (ఐఎండీ) గురువారం ఉదయం ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరాలకు హెచ్చరికలు జారీ చేసింది. ఈ మేరకు గురువారం తెల్లవారుజామున 3:12 గంటలకు ట్వీట్ చేసింది. ఈ అల్పపీడనం పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ క్రమంగా తుఫానుగా మారి నైరుతి బంగాళాఖాతం, ఉత్తర తమిళనాడు పుదుచ్చేరి, దాని ఆనుకుని ఉన్న దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరాన్ని తాకే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది.

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2022: ఆధిక్యంలో హర్ధిక్ పటేల్

దీని ప్రభావంతో గంటకు 65.75 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని ఐఎండీ తెలిపింది. అలాగే రాబోయే రెండు రోజుల పాటు పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కంది. కోస్తాంధ్ర, పుదుచ్చేరి, కరైకల్ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు, దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ పరిసర ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది.

ఉత్తర కోస్తా తమిళనాడు, పుదుచ్చేరి, దాని ఆనుకుని ఉన్న దక్షిణ కోస్తాంధ్ర, ఉత్తర కోస్తాంధ్ర, తమిళనాడు, దాని ఆనుకుని ఉన్న రాయలసీమలో ఈ నెల 9న తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తన బులెటిన్లో పేర్కొంది. ఆ తర్వాత వర్షపాతం తగ్గే అవకాశం ఉంది. అయితే తమిళనాడు, పుదుచ్చేరి, ఆంధ్రప్రదేశ్లోని కొన్ని ప్రాంతాల్లో డిసెంబర్ 10న భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే ఈదురు గాలులు కూడా వీచే అవకాశం ఉంది. 

హిమాచల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు: కాంగ్రెస్, బీజేపీల మధ్య హోరాహోరీ..

డిసెంబర్ 10 మధ్యాహ్నం నాటికి గంటకు 50-60 కిలోమీటర్లకు, రాత్రి నాటికి 40-50 కిలోమీటర్లకు తగ్గే అవకాశం ఉంది. అయితే ఆగ్నేయ బంగాళాఖాతం, శ్రీలంక తీరం వెంబడి ఈ రోజుల్లో మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని అధికారులు సూచించారు. కాగా.. తాజా వాతావరణ పరిస్థితి నేపథ్యంలో పుదుచ్చేరి విపత్తు నిర్వహణ అథారిటీతో పుదుచ్చేరి ముఖ్యమంత్రి ఎన్ రంగస్వామి బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ..  ఈ తుఫాను ఎదుర్కోవడానికి జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (ఎన్డీఆర్ఎఫ్) బృందం అప్రమత్తంగా ఉందని అన్నారు. 

కాగా.. మాండౌస్ తుఫాను నేపథ్యంలో  ఏపీలోని చిత్తూరు జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. అందులో భాగంగా ఆ జిల్లా కలెక్టర్ వై.హరినారాయణన్. తుఫాన్ సమయంలో తీసుకోవాల్సిన సహాయక చర్యలపై బుధవారం జిల్లా సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. అన్ని శాఖల జిల్లా, మండల స్థాయి అధికారులు అప్రమత్తంగా ఉండాలని, సహాయక చర్యలకు ముందస్తు ఏర్పాట్లు చేయాలని చిత్తూరు జిల్లా కలెక్టర్ వై.హరినారాయణన్ ఆదేశించారు.

20 ఏళ్ల కిందట బాలికపై బంధువు అత్యాచారం.. ఎట్టకేలకు అరెస్టు చేసిన పోలీసులు

మాండౌస్ తుఫాను నేపథ్యంలో తీసుకోవాల్సిన సహాయక చర్యలపై బుధవారం జిల్లా సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. 11వ తేదీ వరకు నాలుగు రోజుల పాటు అన్ని శాఖల అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రధానంగా తహశీల్దార్లు అన్ని శాఖల అధికారులు, సచివాలయ సిబ్బందితో సమన్వయం చేసుకోవాలని సూచించారు. వాగులు, వంపులు, చెరువుల వద్ద నీటి ప్రవాహ వేగాన్ని ఎప్పటికప్పుడు అంచనా వేయాలని అన్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిస్తూ మౌలిక వసతులు కల్పించాని, ప్రాణనష్టం జరగకుండా చూసుకోవాలని ఆదేశించారు.

Follow Us:
Download App:
  • android
  • ios