Asianet News TeluguAsianet News Telugu

20 ఏళ్ల కిందట బాలికపై బంధువు అత్యాచారం.. ఎట్టకేలకు అరెస్టు చేసిన పోలీసులు

బాలికపై అత్యాాచారం చేసి 20 ఏళ్లుగా తప్పించుకొని తిరుగుతున్న వ్యక్తిని పోలీసులు ఎట్టకేలకు అరెస్టు చేశారు. నిందితుడి వల్ల బాలిక మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఈ ఘటనపై 2002 కేసు నమోదు కాగా.. తాజాగా అతడిని అదుపులోకి తీసుకున్నారు. 

A relative raped a girl less than 20 years ago.. Police finally arrested
Author
First Published Dec 8, 2022, 8:48 AM IST

20 ఏళ్ల కిందట తన బంధువుల బాలికను కిడ్నాప్ చేసి, అత్యాచారం చేసి గర్భం దాల్చేందుకు కారణమైన వ్యక్తిని పోలీసులు ఎట్టకేలకు అరెస్టు చేశారు. 2002లో సంవత్సరంలో 16 ఏళ్ల తన బంధువును కిడ్నాప్ చేసిన అతడు బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు. అప్పటి నుంచి అతడు తప్పించుకు తిరుగుతున్నాడు. అయితే బాలిక గర్భం దాల్చి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు తాజాగా నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు ముందు 30 మంది నాయ‌కుల‌పై కాంగ్రెస్ వేటు

వివరాలు ఇలా ఉన్నాయి. 2000 జూన్ 15 తేదీన యమునానగర్‌కు చెందిన ఓ వ్యక్తి (అప్పటికి అతడి వయస్సు 24) ఢిల్లీలోని గీతా కాలనీలో ఉన్న తన బంధువుల ఇంటికి వచ్చాడు. తన భార్యకు ఆరోగ్యం బాగాలేదని, కొన్ని రోజుల పాటు ఇంటి పనుల్లో సాయంగా ఉండేందుకు 16 ఏళ్ల బాలికను తనతో పాటు పంపించాలని కోరారు. అతడి మాటలు నమ్మిన కుటుంబ సభ్యులు తమ కూతురిని నిందితుడి వెంట పంపించారు.

గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు స‌హా 6 అసెంబ్లీ ఉప ఎన్నికల ఫలితాలకు కౌంట్‎డౌన్ షురూ..

అక్కడికి ఆమెను చండీగఢ్‌లోని స్నేహితురాలి ఇంటికి తీసుకెళ్లాడు. అక్కడ తన స్నేహితుడితో కలిసి నాలుగు రోజుల పాటు అత్యాచారం చేసి అభ్యంతరకర ఫొటోలు కూడా తీశాడు. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే ఆ ఫొటోలను బంధువులందరికీ పంపిస్తామని బెదిరించారు. అనంతరం ఆమెను చండీగఢ్‌లోని కజేరి గ్రామానికి తరలించాడు. అయితే బాలిక గర్భం దాల్చింది. 2001 జూలై 8న సెక్టార్ 16లోని గవర్నమెంట్ మల్టీ-స్పెషాలిటీ హాస్పిటల్ (జీఎంఎస్ హెచ్) లో ఆమె మగబిడ్డకు జన్మనిచ్చింది.

గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2022: కొత్త రికార్డులు నెలకొల్పాలని ఆశిస్తోన్న బీజేపీ

దీంతో బాధితురాలు నిందితుడిపై 2022 సెప్టెంబర్ 21వ తేదీన తన కుటుంబంతో కలిసి నిందితుడిపై ఫిర్యాదు చేసింది. అయితే అప్పటి నుంచి అతడు అనేక నగరాలు మారుతున్నాడు. పోలీసులకు పట్టుబడకుండా గత రెండు దశాబ్దాలుగా అతడు బీహార్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, యమునానగర్‌లోని వివిధ ప్రాంతాల్లో నివసించాడు. ప్రస్తుతం నిందితుడికి 44 వయస్సు వచ్చింది. యమునానగర్ లో అతడు ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తున్నాడని పోలీసులు గుర్తించారు. అక్కడి నుంచి మంగళవారం అరెస్టు చేశారు. బాలిక ఫిర్యాదు మేరకు సెక్టార్ -36 పోలీస్ స్టేషన్‌లో ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 363, 366, 368, 376, 494, 506 కింద పోలీసులు అతడిపై ఆ సమయంలోనే కేసు నమోదు చేశారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios