సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర సంచలన నిర్ణయం తీసుకున్నారు. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నార్సింగి పోలీస్ స్టేషన్ సీఐ, ఎస్‌ఐలను స్టీఫెన్ రవీంద్ర సస్పెండ్ చేశారు.

సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర సంచలన నిర్ణయం తీసుకున్నారు. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నార్సింగి పోలీస్ స్టేషన్ సీఐ, ఎస్‌ఐలను స్టీఫెన్ రవీంద్ర సస్పెండ్ చేశారు. సీఐ గంగాధర్, ఎస్‌ఐ లక్ష్మణ్‌లపై భూ వివాదాలకు సంబంధించి అవినీతి ఆరోపణలు రావడంతో వారిని సస్పెండ్ చేస్తూ సీపీ ఉత్తర్వులు జారీ చేశారు. కొంత కాలంగా.. ఎస్‌ఐ, సీఐలు ఇద్దరు భూ వివాదాల్లో తలదూర్చినట్టుగా కమిషనర్‌‌ దృష్టికి వచ్చింది. అంతేకాకుండా అవినీతి ఆరోపణలు కూడా రావడంతో సీపీ Stephen Ravindra వారిపై చర్యలు తీసుకున్నారు. ఈ వ్యవహారంపై సీపీ అంతర్గత విచారణకు కూడా ఆదేశించినట్టుగా సమాచారం. సీఐ గంగాధర్, ఎస్ఐ లక్ష్మణ్ల బాధితులు ఇంకా ఎవరైనా ఉన్నారా? అనే దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Also read: లఖింపుర్ కేసు.. ప్రధాన నిందితుడిగా ఉన్న కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కుమారుడికి డెంగ్యూ.. ఆస్పత్రికి తరలింపు..

మరోవైపు బెట్టింగ్‌కు పాల్పడేవారిపై సీపీ స్టీఫెన్ రవీంద్ర కొరడా ఝళిపిస్తున్నారు. నేడు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ కావడంతో భారీగా బెట్టింగులు సాగుతున్నాయి. యువత, ఐటీ ఉద్యోగులు కూడా బెట్టింగుల్లో పాల్గొంటున్నారని పోలీసులకు సమాచారం అందింది. ఈ నేపథ్యంలో బెట్టింగ్‌లకు సంబంధించిన ఫిర్యాదుల కోసం 94906 17444 వాట్సాప్‌ నంబర్‌లో సంప్రదించాలని సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ స్టీఫెన్‌ రవీంద్ర సూచించారు.