లఖింపుర్ కేసు.. ప్రధాన నిందితుడిగా ఉన్న కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కుమారుడికి డెంగ్యూ.. ఆస్పత్రికి తరలింపు..

లఖింపుర్ ఖేరి కేసులో కేంద్ర మంత్రి అజయ్ కుమార్ మిశ్రా కుమారుడు అశిష్ మిశ్రా ప్రధాన నిందితుడిగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి అరెస్ట్ అయి జైలులో ఉన్న అశిష్‌కు డెంగ్యూ సోకింది.

Lakhimpur kheri Violence main Accused Ashish Mishra in Hospital After tested dengue positive

లఖింపుర్ ఖేరి కేసులో కేంద్ర మంత్రి అజయ్ కుమార్ మిశ్రా కుమారుడు అశిష్ మిశ్రా ప్రధాన నిందితుడిగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి అరెస్ట్ అయి జైలులో ఉన్న అశిష్‌కు డెంగీ సోకింది. ఆయనకు డెంగ్యూ పాజిటివ్‌గా నిర్దారణ కావడంతో చికిత్స నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు అధికారులు వివరాలు వెల్లడించారు. ప్రస్తుతం ఆయన రిమాండ్​ ఖైదీగా ఉన్నారు. అయితే శనివారం సాయంత్రం ఆయనను తిరిగి జిల్లా జైలుకు తరలించారు. ఈ క్రమంలో Ashish Mishraకు వైద్య పరీక్షలు చేయించగా.. డెంగ్యూ ఉన్నట్లు తేలిందని అదనపు పోలీసు సూపరింటెండెంట్ అరుణ్ కుమార్ సింగ్ తెలిపారు.

Lakhimpur Kheri‌లో అక్టోబర్ 3వ తేదీన మూడు వాహనాలతో కూడిన కాన్వాయ్ ఆందోళన చేస్తున్న రైతులపైకి దూసుకెళ్లింది. ఈ ఘటన నలుగురు రైతులు, ఒక జర్నలిస్టు మరణించారు. రైతులపైకి దూసుకెళ్లిన వాహనాల్లో ఒకటి కేంద్ర మంత్రి  Ajay Mishra కుమారుడు  అశిష్ మిశ్రాది. దీంతో ఆగ్రహించిన రైతులు వాహనాలకు నిప్పంటించారు. ఈ క్రమంలోనే ముగ్గురు బీజేపీ కార్యకర్తలు కూడా ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపింది. ఈ ఘటనకు కారణమైన అశిష్ మిశ్రాపై చర్యలు తీసుకోవాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. 

రైతులను ఢీ కొట్టిన ఎస్‌యూవీ డ్రైవింగ్ సీటులో మంత్రి కొడుకు ఉన్నాడని మృతుల కుటుంబీకులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో ఆరోపించారు. దీనిపై ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు  బృందాన్ని ఏర్పాటు చేసింది. ఈ ఘటనలో సుప్రీం కోర్టు కూడా జోక్యం చేసుకుంది. ఆ తర్వాత 12 గంటల పాటు అశిష్ మిశ్రాను ప్రశ్నించిన పోలీసులు.. అక్టోబర్ 9న అతడిని అరెస్ట్ చేశారు. ఇప్పటివరకు ఈ కేసుకు సంబంధించి సిట్ అధికారులు మొత్తం 13 మందిని అరెస్ట్ చేశారు.

Also read: మహిళలు చీకటి పడిన తర్వాత పోలీస్ స్టేషన్లకు వెళ్లొద్దు.. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు బేబీ రాణి మౌర్య

అయితే లఖింపుర్ ఖేరీ ఘటనకు సంబంధించి తనపై వచ్చిన ఆరోపణలను అశిష్ మిశ్రా ఖండించారు. హింస జరిగినప్పుడు తాను అక్కడ లేనని అన్నారు. అక్కడికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న తన తండ్రి ఉరిలో ఉన్నట్టుగా చెప్పారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios