Commonwealth Games: కామన్వెల్త్ గేమ్స్ 2022లో తులికా మాన్ జూడోలో రజతం గెలుచుకుంది. మహిళల +78 కేజీల విభాగంలో ఫైనల్‌లో సారా అడ్లింగ్టన్ చేతిలో తులికా మాన్ ఓట‌మితో సిల్వ‌ర్ మెడ‌ల్ తో స‌రిపెట్టుకుంది.  

Tulika Maan: బర్మింగ్‌హామ్ వేదిక‌గా జ‌రుగుతున్న కామన్వెల్త్ గేమ్స్ 2022లో జూడోలో భార‌త్ కు మ‌రో ప‌త‌కం ద‌క్కింది. తులికా మాన్ మహిళల +78 కేజీల విభాగంలో సిల్వ‌ర్ మెడ‌ల్ ను సాధించింది. స్కాట్లాండ్‌కు చెందిన సారా అడ్లింగ్టన్ ఫైనల్‌లో మాన్‌పై విజ‌యం సాధించ‌డంతో ఆమె సిల్వ‌ర్ ద‌క్కింది. అంతకు ముందు జరిగిన సెమీఫైనల్‌లో న్యూజిలాండ్‌కు చెందిన సిడ్నీ ఆండ్రూస్‌ను ఓడించి ఫైన‌ల్ కు దూసుకెళ్లి.. స్వర్ణ పతక పోటీలో చోటు సంపాదించుకుంది.

Scroll to load tweet…

కామన్వెల్త్ గేమ్స్ 2022లో జూడోలో భార‌త్ కు మ‌రో ప‌త‌కం అందించిన తులికా మాన్ కు ప్రధాని మోడీ సహా పలువురు ప్రముఖులు అభినందనలు తెలిపారు. 

Scroll to load tweet…

2022 కామన్వెల్త్ గేమ్స్‌లో జూడోలో భారత్‌కు ఇది మూడో పతకం. సోమవారం శుశీలా దేవి లిక్మాబామ్, విజయ్ కుమార్ యాదవ్ వరుసగా రజతం, కాంస్యం సాధించారు.

Scroll to load tweet…

Scroll to load tweet…

కాగా, తులికా మాన్ ఇంతకుముందు 2019లో ఖాట్మండులో జరిగిన దక్షిణాసియా క్రీడల్లో బంగారు పతకాన్ని గెలుచుకుంది. ఆమె CWGలో పాల్గొనడానికి ముందు.. మాడ్రిడ్ యూరోపియన్ ఓపెన్ 2022లో పాల్గొంది. అక్కడ ఆమె ఐదవ స్థానాన్ని పొందింది. తాజా గేమ్‌లలో ఆమె అద్భుతమైన రెండవ స్థానంలో నిలవ‌డంతో మాన్ కజకిస్తాన్‌లోని నూర్-సుల్తాన్‌లో జరగనున్న ఆసియా సీనియర్ ఛాంపియన్‌షిప్స్ 2022 (Asian Senior Championships 2022) లో పాల్గొనాల్సి ఉంది.