Commonwealth Games: 2022 కామన్వెల్త్ గేమ్స్‌లో భార‌త బాక్స‌ర్ నిఖత్ జరీన్ సెమీఫైనల్‌కు చేరుకుంది. ఆమె లైట్ ఫ్లై వెయిట్ విభాగంలో సెమీఫైనల్‌కు చేరుకోవడంతో భారత్ కు మ‌రో పతకాన్ని అందించనున్న‌ మూడవ భారతీయ బాక్సర్‌గా నిలిచింది. 

Nikhat Zareen: 2022 కామన్వెల్త్ గేమ్స్‌లో నిఖత్ జరీన్ సెమీఫైనల్‌కు చేరుకుంది. నిఖత్ జరీన్ లైట్ ఫ్లై వెయిట్ విభాగంలో సెమీఫైనల్‌కు చేరుకోవడంతో భారతదేశానికి పతకాన్ని అందించ‌నున్న‌ మూడవ భారతీయ బాక్సర్‌గా నిలవ‌నుంది. బుధవారం జరిగిన మహిళల బాక్సింగ్ లైట్ ఫ్లై వెయిట్ విభాగంలో జరిగిన క్వార్టర్ ఫైనల్లో నిఖత్ జరీన్.. వేల్స్‌కు చెందిన హెలెన్ జోన్స్‌పై విజయం సాధించి సెమీఫైనల్‌లోకి దూసుకెళ్లింది. ఆమె తన ప్రత్యర్థిని 5-0తో ఓడించింది. నిఖత్ తమ చివరి-ఎనిమిది బౌట్‌లో గెలిచి కనీసం కాంస్య పతకాన్ని సాధించిన మూడవ భారతీయ బాక్స‌ర్ గా నిలిచింది. 

Scroll to load tweet…

Scroll to load tweet…

Commonwealth Games 2022 లో 6వ రోజున భారతీయ అథ్లెట్లకు సంబంధించిన ముఖ్య అంశాలు ఇలా ఉన్నాయి.. 

వెయిట్ లిఫ్టింగ్: భార‌త్ ఖాతాలో మ‌రో కాంస్య ప‌త‌కం వ‌చ్చి చేరింది. పురుషుల 109 కేజీల విభాగంలో లవ్‌ప్రీత్ సింగ్ మొత్తం 355 కేజీలు ఎత్తి మూడో స్థానంలో నిలిచారు.

Scroll to load tweet…

స్క్వాష్: కాంస్య ప‌త‌కం ల‌భించింది. సౌరవ్ ఘోసల్ స్క్వాష్‌లో CWGలో సింగిల్స్ పతకాన్ని గెలుచుకున్న మొట్టమొదటి భారతీయుడుగా నిలిచాడు. 35 ఏళ్ల గోల్డ్ కోస్ట్ 2018 గేమ్స్ లో స్వర్ణ పతక విజేత అయిన‌ జేమ్స్ విల్‌స్ట్రాప్‌ను వరుస గేమ్‌లలో ఓడించాడు.

జూడో : జూడోలో సిల్వర్ ప‌త‌కం భార‌త్ ఖాత‌లో చేరింది. మహిళల +78 కేజీల విభాగంలో రెండో సీడ్‌గా నిలిచిన తులికా మాన్‌ రెండో స్థానంలో నిలిచింది. భారత్‌కు మూడో జూడో పతకం అందించింది. 

బాక్సింగ్: బాక్సింగ్ లో బుధ‌వారం నాడు భార‌త్ కు మూడు పతకాలు ఖాయం అయ్యాయి. నీతూ ఆధిపత్య ప్రదర్శనతో సెమీ ఫైన‌ల్ కు చేరుకుంది. అలాగే, మ‌రో బాక్స‌ర్ హుస్సాముద్దీన్ సైతం భార‌త్ కు మ‌రో ప‌త‌కాన్ని ఖాయం చేశాడు. అతనికి రెండో CWG పతకం ఖాయమైంది. ప్రపంచ ఛాంపియన్ నిఖత్ జరీన్ సెమీస్‌లోకి దూసుకెళ్లింది.

హాకీ : సెమీఫైనల్‌లోకి ప్రవేశించడానికి భారత మహిళలు విజయం సాధించారు.