పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ ఉద్యోగులకు ఇప్పటికే 105 శాతం డీఏ ఇస్తున్నామని, మళ్లీ దాని కంటే ఎక్కువ అందించడం కుదరదని ఆ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు భిన్నమైన పే స్కేల్ ఉంటుందని తెలిపారు. 

డియర్‌నెస్ అలవెన్స్ (డీఏ) పెంచాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు చేస్తున్న నిరసనపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అసహనం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో సమానంగా డీఏ అందించలేదని అన్నారు.

'వీడోక్కడే' సీన్ రిపీట్.. కడుపులో 29 కోట్ల విలువైన డ్రగ్స్.. ఇద్దరు నైజీరియన్ల అరెస్ట్

అసెంబ్లీలో పొడిగించిన బడ్జెట్ సెషన్‌లో సీఎం మాట్లాడుతూ.. ప్రతిపక్షాలు తన తల నరికి వేయవచ్చని, కానీ కరువు భత్యం పెంచడానికి ఏమీ చేయలేనని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల జీతాల వ్యత్యాసాన్ని వివరించిన ఆమె, టీఎంసీ ప్రభుత్వం ఇప్పటికే తమ ఉద్యోగులకు 105 శాతం డీఏ ఇస్తోందని పేర్కొన్నారు.

వైమానిక దళం చారిత్రాత్మక నిర్ణయం.. యుద్ధ భూమిలో కమాండర్‏గా షాలిజా ధామి

‘‘నేను 105 శాతం డీఏ ఇస్తున్నాను. మీకు ఇంకా ఎంత కావాలి? కేంద్ర ఉద్యోగులతో పోలిస్తే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు భిన్నమైన వేతన స్కేలు ఉంది. వారు (కేంద్రం) 100 రోజుల పని డబ్బు, ఇతరాలు ఇవ్వడం లేదు కాబట్టి మాకు అంత సామర్థ్యం లేదు. మేం ఇచ్చేది (డీఏ ఇష్యూ) అంగీకరించండి. మీకు నచ్చకపోతే నా తల నరికి చంపేయండి. కానీ అంతకుమించి నేనేమీ చేయలేను’’ అని డియర్నెస్ అలవెన్స్, ఇతర డిమాండ్లపై నిరసనలపై మమతా బెనర్జీ రాష్ట్ర అసెంబ్లీలో వ్యాఖ్యలు చేశారు.

ప్రధాని మోదీకి తమిళనాడు సీఎం లేఖ... ఇంతకీ ఆ లేఖలో ఏముందో తెలుసా?

2023-24 బడ్జెట్ లో పశ్చిమ బెంగాల్ ఆర్థిక మంత్రి చంద్రిమా భట్టాచార్య రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు కరువు భత్యాన్ని 3 శాతం పెంచుతున్నట్లు ప్రకటించారు. కాగా.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా కరువు భత్యం పెంచాలని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు చెందిన పలు సంఘాలు నిరసన వ్యక్తం చేస్తున్నాయి.