Asianet News TeluguAsianet News Telugu

క్యూలో నిల్చోవద్దు.. డోర్ డెలివరీ చేస్తామని: మందుబాబుపై సైబర్ నేరగాళ్ల గురి

కరోనా కారణంగా విధించిన లాక్‌డౌన్‌‌తో అందరి కంటే ఎక్కువగా బాధపడిన వారు మందుబాబులే. చుక్క పడనిదే వుండలేని వారంతా కరోనా దెబ్బకు పిచ్చెక్కిపోయారు. మందు కోసం రకరకాల ప్రయోగాలు చేసి ప్రాణాల మీదకు తెచ్చుకున్నవారు ఎంతోమంది ఉన్నారు.

customers complained of fraudsters duping them through fake social media accounts
Author
Mumbai, First Published May 19, 2020, 3:45 PM IST

కరోనా కారణంగా విధించిన లాక్‌డౌన్‌‌తో అందరి కంటే ఎక్కువగా బాధపడిన వారు మందుబాబులే. చుక్క పడనిదే వుండలేని వారంతా కరోనా దెబ్బకు పిచ్చెక్కిపోయారు. మందు కోసం రకరకాల ప్రయోగాలు చేసి ప్రాణాల మీదకు తెచ్చుకున్నవారు ఎంతోమంది ఉన్నారు.

అయితే మద్యం విక్రయాలకు కేంద్ర ప్రభుత్వం అనుమతి మంజూరు చేయడంతో మందుబాబులకు ఊరట కలిగింది. ఈ వెసులుబాటుతో ఇన్నాళ్లు మందులేక వెర్రెత్తిపోయిన వారంతా మద్యం దుకాణాల ముందు క్యూకట్టారు.

ఈ నేపథ్యంలో మహరాష్ట్రలో కరోనా తీవ్రత అధికంగా ఉండటంతో అక్కడి ప్రభుత్వం లిక్కర్ హోం డెలివరీకి అనుమతించింది. దీంతో సైబర్ నేరగాళ్లు మందుబాబులను టార్గెట్ చేశారు.

ముంబై మహానగరంలో పాపులర్ అయిన మద్యం దుకాణాల పేరిట నకిలీ ఫేస్‌బుక్ ఖాతాలు తెరిచి ప్రజలకు వల విసురుతున్నారు. ఇందులో ఉన్న ఫోన్ నెంబర్లకు ఫోన్ చేస్తే మద్యం సరఫరా చేయాలని.. కానీ పేమెంట్ మాత్రం క్రెడిట్, డెబిట్ కార్డుల ద్వారా చేయాలని సూచిస్తూ మందుబాబులను దోచేస్తున్నారు.

తాజాగా ఓ సినీ నిర్మాత వీరి బుట్టలో పడటం బాలీవుడ్‌లో కలకలం రేపింది. ఇటీవల ఆయన జుహూలోని ఓ మద్యం దుకాణం పేరుతో ఉన్న ఫేస్‌బుక్‌ ఖాతాకు ఫోన్ చేసి అందులో పేర్కొన్న మొబైల్ నెంబర్ ద్వారా ఫోన్ చేసి రూ.40 వేల మద్యాన్ని ఆర్డర్ చేశాడు.

అయితే టోకెన్ కింద రూ. 5 వేలు చెల్లించాలని చెప్పారు. వారు చెప్పినట్లే ఆయన చేశాడు. ఆ తర్వాత విచారిస్తే వీళ్లంతా మోసగాళ్లని అర్ధమైంది. పశ్చిమ బెంగాల్‌లో అసన్‌సోల్, బీహార్ నుంచి కొందరు ఇలా చేస్తున్నారని తెలిసింది.

అలాగే ఓ మాజీ అధికారి ఒకరు తెలిపారు. ఆ ఆర్డర్ తీసుకున్న వ్యక్తి క్రెడిట్, డెబిట్ కార్డు ద్వారానే చెల్లింపులు చేయాలని చెప్పాడు. అంతేకాకుండా ఓటీపిని షేర్ చేయాలని అడిగాడన్నారు.

దీంతో ఆయనకు అనుమానం రాకుండా ఎక్కువ మొత్తంలో ఆర్డర్ చేయాలనుకున్నప్పటికీ రూ.1,400 మద్యానికే ఆర్డర్ చేశానని తెలిపారు. ఈ సైబర్ మోసాలపై ఓ మాజీ ఎమ్మెల్యే స్పందిస్తూ.. తన స్నేహితుల నుంచి కూడా ఇలాంటి ఫిర్యాదులే కొన్ని వచ్చాయన్నారు.

సామాజిక మాధ్యమాల వేదికగా ఇలాంటి మోసాలు జరుగుతున్నాయని చెప్పారు. కొందరు కేటుగాళ్లు క్రెడిట్, డెబిట్ కార్డు నంబర్లు, సీవీవీ వివరాలు అడుగుతున్నారని.. సందేహించని వారిని మోసగిస్తున్నారు. దీనిపై ఆయన పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. దీనిపై సీనియర్ అధికారులతో దర్యాప్తు చేయించాలని కోరుతున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios