ఢిల్లీలో ఇద్దరు యువకులు కారు నడుపుతూ రోడ్డుపైనే కరెన్సీ వెదజల్లారు. ఫర్జీ వెబ్ సిరీస్‌లోని సీన్ రీక్రియేట్ చేస్తూ వారు ఈ పని చేశారు. వీడియోను ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌లో పోస్టు చేశారు. పోలీసులు వారిద్దరినీ అరెస్టు చేశారు. 

న్యూఢిల్లీ: బాలివుడ్ యాక్టర్ షహీద్ కపూర్ వెబ్ సిరీస్ ఫర్జీలో యాక్టర్, అతని ఫ్రెండ్స్ కలిసి ఫేక్ కరెన్సీని రోడ్డుపై వెదజల్లుతారు. పోలీసులను వణికించడానికి వారు ఈ మార్గాన్ని ఎంచుకుంటారు. అయితే, అది వెబ్ సిరీస్. కానీ, ఇదే సీన్ రీక్రియేట్ చేస్తూ కొందరు కరెన్సీ రోడ్డుపై విసిరేశారు. ఢిల్లీలో రోడ్డుపై కారులో వెళ్లుతుండగా వెనుక కూర్చుని ఓ వ్యక్తి డబ్బును విసిరేశాడు. ఇందుకు సంబంధించిన వీడియోను వారు పోస్ట్ చేశారు. ఈ వీడియో వేగంగా వైరల్ అయింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగారు.

ఈ వైరల్ వీడియో ప్రకారం, ఓ వైట్ కారులో ఇద్దరు యువకులు వెళ్లుతున్నారు. ఒకరు డ్రైవింగ్ చేస్తుండగా మరొకరు వెనుక కూర్చుని డోర్ ఓపెన్ చేశాడు. కరెన్సీ నోట్లను బయటకు వెదజల్లుతూ కనిపించాడు. ఆ వీడియోలో బ్యాక్‌గ్రౌండ్‌లో మ్యూజిక్ వినిపిస్తున్నది. అయితే, వారు విసిరేసిన కరెన్సీ.. నకిలీదా? రియల్‌దా? అనేది తెలియరాలేదు.

Also Read: ‘నాటు నాటు నాటు’ ఆస్కార్ అవార్డు క్రెడిట్ కేంద్రం తీసుకోకూడదు - రాజ్యసభలో కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే..

ఆ వీడియోను ఆ ఇద్దరూ ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌లో అప్‌లోడ్ చేశారు. ఈ వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో వెంటనే వైరల్ అయింది. పోలీసులు ఆ ఇద్దరిపై కేసు ఫైల్ చేశారు. 

Scroll to load tweet…

సోషల్ మీడియాలోని వీడియో ద్వారానే పోలీసులకు ఈ విషయం తెలిసింది. ఓ మూవీలోని సీన్‌ను రీక్రియేట్ చేస్తూ కరెన్సీ నోట్లను గోల్ఫ్ కోర్స్ రోడ్డుపై విసిరేశారని డీఎల్ఎఫ్ గురుగ్రామ్ ఏసీపీ వికాస్ కౌశిక్ తెలిపారు. ఐపీసీలోని పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు ఫైల్ చేశారు. ప్రధాన నిందితులను గుర్తించినట్టు వివరించారు.

మంగళవారం వారిద్దరినీ కస్టడీలోకి తీసుకున్నట్టు పోలీసులు చెప్పారు.