ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు దక్కడం గర్వంగా ఉందని, అయితే ఈ అవార్డు క్రిడెట్ కేంద్ర ప్రభుత్వం తీసుకోకూడదని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే అన్నారు. రాజ్యసభలో ఈ అవార్డులపై చర్చ సందర్భంగా ఖర్గే ఈ వ్యాఖ్యలు చేయడంతో సభ్యులంతా నవ్వారు. 

ఆస్కార్ అవార్డులు గెలుచుకున్న ఆర్ఆర్ఆర్ లోని ‘నాటు నాటు’, డాక్యుమెంటరీ ‘ది ఎలిఫెంట్ విస్పర్స్’ రూపకర్తలకు రాజ్యసభ అభినందనలు తెలిపింది. ఈ రోజు పార్లమెంట్ లో ఈ ఆస్కార్ అవార్డులపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా రాజ్యసభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే ఆర్ఆర్ఆర్ చిత్ర యూనిట్ కు అభినందనలు తెలిపారు. దీంతో పాటు బీజేపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. నాటు-నాటు పాటకు ఆస్కార్ దక్కడం గర్వంగా ఉందని ఆయన అన్నారు. కానీ కేంద్ర ప్రభుత్వం దీని క్రెడిట్ తీసుకోకూడదని, ప్రధాని మోడీ ఈ చిత్రానికి దర్శకత్వం వహించలేదని చమత్కరించారు. దీంతో ఎగువ సభలో నవ్వులు విరిశాయి.

భోపాల్ గ్యాస్ విషాదం కేసు: అదనపు పరిహారం పిటిషన్‌ను తోసిపుచ్చిన సుప్రీంకోర్టు

‘‘నాటు-నాటు పాటకు ఆస్కార్‌ దక్కడం గర్వంగా ఉంది. కానీ మేమే దీనికి దర్శకత్వం వహించాం, ఈ కవిత రాశాం, మోడీ జీ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు అనే క్రెడిట్‌ను అధికార పార్టీ తీసుకోవద్దని అభ్యర్థిస్తున్నాం. నాది ఇది ఒక్కటే విన్నపం.’’ అని అనడంతో విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్‌తో పాటు బీజేపీ ఎంపీలు, ప్రతిపక్షాల నాయకులందరూ నవ్వారు. రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ కర్ కూడా నవ్వారు. 

Scroll to load tweet…

రాజ్యసభలో నాటు-నాటుకు ఆస్కార్ లభించినందుకు అభినందనలు తెలుపుతున్న సమయంలో దక్షిణ భారత సినిమా ఆస్కార్‌ను గెలుచుకుందన్న ఖర్గే వాదనపై ఎస్పీ ఎంపీ జయా బచ్చన్ స్పందించారు. దీనికి తాము సంతోషిస్తున్నామని, అయితే అవార్డు పొందినవారు తూర్పు, దక్షిణం, పశ్చిమం, ఉత్తరం అనే తేడా లేదని అన్నారు. మనమంతా భారతీయులం. సత్యజిత్ రే తర్వాత సినిమా ప్రపంచం చాలాసార్లు దేశాన్ని నడిపించినందుకు సంతోషిస్తున్నామని చెప్పారు.

అభివృద్ధి కార్యక్రమాలపై మంత్రిని ప్రశ్నించిన జర్నలిస్టు అరెస్టు.. బెయిల్ పై విడుదల.. ఎక్కడంటే? (వీడియో)

కాగా... అంతకుముందు జగ్ దీప్ ధన్ కర్ మాట్లాడుతూ.. 95వ ఆస్కార్ అవార్డులు దేశానికి గర్వకారణమని అన్నారు. ‘ది ఎలిఫెంట్ విస్పర్స్’, 'ఆర్ఆర్ఆర్' చిత్రాలు సాధించిన విజయాలు భారతదేశం సినిమాకు కొత్త గుర్తింపును తీసుకొచ్చాయని తెలిపారు. భారతీయ చలన చిత్ర పరిశ్రమ అంతర్జాతీయీకరణకు ఈ అవార్డులు మరింత దోహదపడతాయన్నారు. ‘‘ఈ విజయాలు భారతీయ కళాకారుల అపారమైన ప్రతిభ, అపారమైన సృజనాత్మకత, నిబద్ధత ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలను కూడా ప్రతిబింబిస్తాయి’’ అని చెప్పారు.

Scroll to load tweet…

ఇదిలా ఉండగా.. సోమవారం ప్రధాని నరేంద్ర మోడీతో పాటు పలువురు కేంద్ర మంత్రులు నాటు-నాటు పాటకు ఆస్కార్ అవార్డు వచ్చినందుకు అభినందనలు తెలిపారు. పాట స్వరకర్త ఎంఎం కీరవాణికి, ఆర్‌ఆర్‌ఆర్‌ బృందానికి అభినందనలు తెలుపుతూ ‘‘నాటు నాటు పాట ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఇది భారతదేశానికి గర్వకారణం. 'నాటు నాటు'కి ప్రపంచ వ్యాప్తంగా ఆదరణ పెరిగింది’’ అని ప్రధాని ట్వీట్ లో పేర్కొన్నారు.