క్రికెటర్ కేదార్ జాదవ్ తండ్రి సోమవారం ఉదయం అదృశ్యం అయ్యారు. దీంతో ఆయన కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గంటల తరబడి శ్రమించిన పోలీసులు ఆయన ఆచూకీ కనుగొన్నారు. చివరికి కుటుంబ సభ్యులకు అప్పగించారు.
భారత క్రికెటర్ కేదార్ జాదవ్ తండ్రి మహదేవ్ జాదవ్ సోమవారం ఇంట్లో నుంచి ఒక్క సారిగా కనిపించకుండా పోయారు. పుణెలోని కొత్రూడ్ ప్రాంతంలో నివాసం ఉండే ఆయన ఉదయం 11.30 గంటల నుంచి అదృశ్యం అయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందారు. ఆయన ఫోన్ స్విచ్ఛాఫ్ కావడంతో వారు మరింత ఆందోళనకు గురయ్యారు.
చివరికి కుటుంబ సభ్యులు అలంకార్ పోలీసులను ఆశ్రయించారు. మహదేవ్ జాదవ్ ఉదయం నుంచి కనిపించడం లేదంటూ వారు పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. అయితే ఉదయం సమయంలో ఆయన సెక్యూరిటీ గార్డును తప్పుదోవ పట్టించి బయటకు వెళ్లాడని, కొద్దిసేపటి తర్వాత అతని ఫోన్ స్విచ్ఛాఫ్ అయిందని ‘ఇండియా టు డే’ నివేదించింది.
ఈ అన్నల ప్రేమ అమూల్యం.. చెల్లి పెళ్లిలో రూ.8కోట్ల విలువైన కానుకలు..
కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో అలంకార్ పోలీసులు అలెర్ట్ అయ్యారు. ఆయన కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ సమయంలో స్థానికంగా ఉన్న అన్ని సీసీ కెమెరాలను పరిశీలించారు. చివరిసారిగా కార్వే నగర్ లో ఉన్న సీసీటీవీ ఫుటేజీల్లో ఆయన కనిపించారు. ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఆయన ఆచూకీని గుర్తించారు. పోలీసు స్టేషన్ కు తీసుకొచ్చారు. సురక్షితంగా కుటుంబ సభ్యులకు అప్పగించారు.
సావర్కర్‌ను అవమానించడం ద్వారా రాహుల్ సత్యయుద్ధంలో గెలవలేరు: సామ్నా సంపాదకీయం
కాగా.. కొంత కాలం నుంచి మహదేవ్ జాదవ్ మతిమరుపుతో బాధపడుతున్నాడని పోలీసులు ధృవీకరించారు. దీంతో ఆయనకు గుర్తుంచుకునే, ఆలోచించే సామర్థ్యం తక్కువగా ఉందని తెలిపారు.
