మే 1 నుంచి 18 ఏళ్లు దాటిన వారందరికీ టీకా పంపిణీ కార్యక్రమం ప్రారంభం కానుంది. అర్హులైన వారందరూ తమ పేర్లను కోవిన్ వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోవాలని కేంద్రం సూచించింది. కోవిన్ వెబ్‌సైట్‌తో పాటు ఆరోగ్య సేతు యాప్, ఉమాంగ్ యాప్‌లలోనూ అర్హులు తమ పేర్లను నమోదు చేసుకునేందుకు గాను జనం క్యూకట్టారు.

దీంతో సర్వర్ క్రాష్ అవ్వడంతో టెక్నికల్ ప్రాబ్లమ్ అన్న విషయం చూపిస్తోంది.  ఒకేసారి భారీగా యాప్‌లను ఓపెన్ చేయడంతో ట్రాఫిక్ ఏర్పడి యాప్‌లో సాంకేతిక సమస్యలు వచ్చాయి. తొలి రోజే యాప్‌లలో సాంకేతిక సమస్యలు రావడంతో జనం తలలు పట్టుకున్నారు.

సాధారణంగా ఒక్కసారిగా ప్రజలు ఆన్‌లైన్‌లో నమోదు కార్యక్రమాలు ప్రారంభించినప్పుడు సర్వర్లు క్రాష్ అవుతాయి. ఒక్కసారిగా టీకా నమోదు కోసం  జనం ప్రయత్నించడంతో యాప్‌లు ఓపెన్ కావడం లేదు. 

Also Read:మే 1 నుంచి 18 ఏళ్లు నిండిన వారికి వ్యాక్షిన్: కోవిన్‌లో రిజిస్ట్రేషన్ ఎలాగంటే..?

వెరిఫై బటన్ మీద క్లిక్ చేస్తే సాంకేతిక సమస్యలంటే యాప్‌లు చూపిస్తున్నాయి. రిజిస్ట్రేషన్ అవుతున్నా.. వ్యాక్సిన్ స్లాట్లు బుక్ కావడం లేదు. దీనికి తోడు 45 ఏళ్లు పైబడిన వారికి మాత్రమే వ్యాక్సిన్  అని చూపిస్తోంది కోవిన్ పోర్టల్. 

కోవిన్‌లో టీకా కోసం నమోదు చేసుకునే వారు ముందుగా కోవిన్ పోర్టల్‌లో లాగిన్ ఇవ్వాలి. ఫోటోతో కూడిన గుర్తింపు కార్డు, పేరు, పుట్టిన తేదీ వంటి వివరాలు నమోదు చేసుకోవాలి. ఒకసారి రిజిస్ట్రేషన్ అయితే టీకా వేయించుకునేందుకు టీకా వేయించుకునేందుకు తేదీని ఎంచుకోవచ్చు. 

ఒక లాగిన్‌పై నలుగురికి అపాయింట్‌మెంట్ తీసుకోవచ్చు. అలాగే తేదీలను మార్చుకునే వెసులుబాటు కూడా వుంది. అంతేకాకుండా టీకా కోసం ఆరోగ్య సేతు యాప్‌లో రిజిస్ట్రేషన్ చేసుకునే వీలుంది. 
 

 

కరోనా మహమ్మారి నుంచి కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరూ మాస్కులు తప్పకుండా ధరించాలని, శానిటైజ్ చేసుకోవాలని, సామాజిక దూరం పాటించాలని ఏషియానెట్ విజ్ఢప్తి చేస్తోంది. సాధ్యమైనంత త్వరగా కరోనా టీకా తీసుకోవాలని కూడా కోరుతోంది. అందరం కలిసి కరోనా వ్యాప్తిని అరికడుదాం, మనల్ని మనం రక్షించుకుందాం.  #ANCares #IndiaFightsCorona