మే 1 నుంచి 18 ఏళ్లు నిండిన వారికి వ్యాక్షిన్: కోవిన్‌లో రిజిస్ట్రేషన్ ఎలాగంటే..?
దేశంలో మే 1 నుంచి 18 ఏళ్లు పైబడిన వారందిరికీ వ్యాక్సినేషన్ ప్రారంభంకానుంది. ఇందుకోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా ప్రారంభమైంది. అర్హులైన వారందరూ తమ పేర్లను కోవిన్ వెబ్‌సైట్, ఆరోగ్య సేతు యాప్‌లో నమోదు చేసుకుంటున్నారు
దేశంలో మే 1 నుంచి 18 ఏళ్లు పైబడిన వారందిరికీ వ్యాక్సినేషన్ ప్రారంభంకానుంది. ఇందుకోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా ప్రారంభమైంది. అర్హులైన వారందరూ తమ పేర్లను కోవిన్ వెబ్‌సైట్, ఆరోగ్య సేతు యాప్‌లో నమోదు చేసుకుంటున్నారు.
18 ఏళ్లు పైబడిన వారంతా వ్యాక్సిన్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. మే 1 నాటికి రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధం చేసిన టీకా కేంద్రాల ఆధారంగా అపాయింట్‌మెంట్ ఖరారవుతుంది. 18 ఏళ్లు పైబడిన వారందరూ టీకా కోసం ముందస్తుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని, ఎలాంటి వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్ వుండబోదని కేంద్రం ఇప్పటికే స్పష్టం చేసింది.
Also Read:ఇండియాలో ఏడో రోజూ అదే జోరు: 24 గంటల్లో మూడున్నర లక్షలు దాటిన కేసులు
అలాగే కేంద్రం రాష్ట్రాలకు ఇచ్చే టీకాలను 45 ఏళ్లు లోపు వారికి వినియోగించకూడదని స్పష్టం చేసింది. అవి కేవలం 45 ఏళ్లు పైబడిన వారికి మాత్రమే అందించాలని సూచించింది. రాష్ట్రాలు ప్రైవేట్ వ్యాక్సిన్లు కొనుగోలు చేసిన వ్యాక్సిన్లు మాత్రమే 18 నుంచి 45 ఏళ్ల లోపు వారికి పంపిణీ చేయాలని తెలిపింది.
కోవిన్‌లో టీకా కోసం నమోదు చేసుకునే వారు ముందుగా కోవిన్ పోర్టల్‌లో లాగిన్ ఇవ్వాలి. ఫోటోతో కూడిన గుర్తింపు కార్డు, పేరు, పుట్టిన తేదీ వంటి వివరాలు నమోదు చేసుకోవాలి. ఒకసారి రిజిస్ట్రేషన్ అయితే టీకా వేయించుకునేందుకు టీకా వేయించుకునేందుకు తేదీని ఎంచుకోవచ్చు.
ఒక లాగిన్‌పై నలుగురికి అపాయింట్‌మెంట్ తీసుకోవచ్చు. అలాగే తేదీలను మార్చుకునే వెసులుబాటు కూడా వుంది. అంతేకాకుండా టీకా కోసం ఆరోగ్య సేతు యాప్‌లో రిజిస్ట్రేషన్ చేసుకునే వీలుంది.
కరోనా మహమ్మారి నుంచి కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరూ మాస్కులు తప్పకుండా ధరించాలని, శానిటైజ్ చేసుకోవాలని, సామాజిక దూరం పాటించాలని ఏషియానెట్ విజ్ఢప్తి చేస్తోంది. సాధ్యమైనంత త్వరగా కరోనా టీకా తీసుకోవాలని కూడా కోరుతోంది. అందరం కలిసి కరోనా వ్యాప్తిని అరికడుదాం, మనల్ని మనం రక్షించుకుందాం. #ANCares #IndiaFightsCorona