Asianet News TeluguAsianet News Telugu

అప్పుడే పుట్టిన దూడకోసం.. ఆటోవెంట 5 కి.మీ.లు పరుగెత్తిన ఆవు...

అప్పుడే పుట్టిన దూడ తనకు దూరమవుతుందన్న ఆవేదనతో ఓ ఆవు రూ.5 కి.మీ.లు పరిగెత్తింది. ఈ ఘటన తమిళనాడులో వెలుగు చూసింది. 

cow ran 5 km for a calf In tamilnadu - bsb
Author
First Published Oct 25, 2023, 7:48 AM IST | Last Updated Oct 25, 2023, 7:48 AM IST

తమిళనాడు : మనుషుల్లోనే కాదు.. పశుపక్షాదుల్లోనూ తల్లి ప్రేమ ఉంటుంది. తమ పిల్లల జోలికి వస్తే ఏవీ ఊరుకోవు. ఎంతటి బలమైన శత్రువైనా సరే ఢీకొట్టడానికి వెనకాడవు. ఇక తన నుంచి తన పిల్లల్ని దూరం చేస్తే అవి పడే వేదన వర్ణనాతీతం. అలాంటి ఒక ఘటనే తమిళనాడులోని తంజావూరులో వెలుగు చూసింది. ఆవు అప్పుడే పుట్టిన తన దూడను యజమాని ఆటోలో తీసుకు వెళుతుంటే ..  దాదాపు 5 కిలోమీటర్ల వరకు అరా పరిగెడుతూనే వెంబడించింది. అది చూసిన అందరూ ఆశ్చర్యపోయారు. దీనికి సంబంధించిన వివరాలలోకి వెళితే…

శబరి నాదం అనే ఆటో డ్రైవర్ తమిళనాడులోని తంజావూరు సెక్కడికి  చెందిన వ్యక్తి. అతను ఇంట్లో ఓ ఆవును పెంచుకుంటున్నాడు. దానికి అతను ఇంట్లో ఓ ఆవును పెంచుకుంటున్నాడు దానికి వీరలక్ష్మి అని పేరు పెట్టాడు. అది ఈమధ్య సూడిద అయింది. సోమవారం ఆవును మేతకు తీసుకువెళ్లగా అక్కడే ఈనింది.  దీంతో అప్పుడే పుట్టిన దూడను అలా వదిలేయలేక శబరినాథ్ ఆటో మాట్లాడుకుని ఇంటికి బయలుదేరాడు.

బైక్ పై వెళ్తున్న దంపతులను అడ్డగించి.. భర్తను చితకబాది, భార్యపై గ్యాంగ్ రేప్..

అది గమనించిన తల్లి ఆవు ఆటో వెంటపడి పరుగులు తీసింది.  పురిటి నొప్పులను కూడా  లెక్కచేయకుండా దాదాపు 5 కిలోమీటర్ల మేరా పరిగెత్తింది. ఇది కాస్త ఆలస్యంగా శబరినాథ్ గమనించాడు.  వెంటనే అతనికి వీరలక్ష్మి ఆవేదన అర్థమయింది. ఆటోను ఆపి, దూడను ఆవు దగ్గరికి తీసుకువెళ్లాడు. తన బిడ్డ తన దగ్గరికి చేరగానే బిడ్డకి పాలు కుడిపింది  వీరలక్ష్మి.  కొంచెంసేపు అలా దూడపాలు తాగిన తర్వాత రెండింటిని శబరినాథన్ ఇంటికి తీసుకువెళ్లాడు.  దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios