బైక్ పై వెళ్తున్న దంపతులను అడ్డగించి.. భర్తను చితకబాది, భార్యపై గ్యాంగ్ రేప్..

బైక్ పై వెళ్తున్న దంపతులను ఐదుగురు దుండుగులు అడ్డగించారు. భర్త దగ్గర నుంచి బైక్ తాళాలు, సెల్ ఫోన్ లాక్కొని, అతడిని చితకబాదారు. అనంతరం భార్యపై సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. ఈ ఘటన ఒడిశాలో జరిగింది.

A couple going on a bike was intercepted.. The husband was crushed, the wife was gang-raped..ISR

సమాజంలో నేడు మహిళలకు రక్షణ లేకుండా పోయింది. నిత్యం ఎక్కడో ఒక చోటు అత్యాచార ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. పని చేసే ప్రదేశంలో, ప్రయాణ సమయాల్లో ఆమెకు లైంగిక వేధింపులు ఎక్కువవుతున్నాయి. కొన్ని సందర్భాల్లో చిన్నారులు, ముసలి వాళ్లు అని కూడా చూడకుండా కామాంధులు అఘాయిత్యాలకు ఒడిగడుతున్నారు. భర్తతో కలిసి ఉన్న సమయంలో కూడా.. అతడిపై దాడి చేసి, భార్యపై అత్యాచారానికి ఒడిగట్టిన ఘటనలూ వెలుగు చూస్తుంటాయి. తాజాగా ఒడిశాలోనూ అలాంటి ఘటనే జరిగింది. 

దైవ దర్శనానికి వెళ్లి వస్తుండగా.. నదిలో పడ్డ కారు.. ఆరుగురి మృతి..

వివరాలు ఇలా ఉన్నాయి. జాజ్ పుర్ లో ఇద్దరు దంపతులు నివసిస్తున్నారు. అయితే భార్యకు చదువుపై ఆసక్తి ఉండటంతో భర్త ఆమె ఇష్టాన్ని గౌరవించారు. భార్యను బారునా ప్రాతంలో ఉంచి చదివిస్తున్నారు. శనివారం ఆమెను తన స్వగ్రామానికి తీసుకొచ్చేందుకు అతడు బైక్ పై బారునా ప్రాంతానికి వెళ్లారు. ఆమెను బైక్ పై ఎక్కించుకొని గ్రామానికి బయలుదేరారు. అయితే డెంకనాల్ జిల్లాలోని ఓ వాగు దగ్గరికి చేరుకోగానే ఐదుగుడు దుండుగులు వారిని అడ్డగించారు. 

బైక్ తాళాలు తీసుకొని, సెల్ ఫోన్ లాక్కున్నారు. అనంతరం భర్తను చితకబాదారు. తరువాత అతడి భార్యను దగ్గరలోని అడివిలోకి లాక్కెళ్లారు. అనంతరం ఆ ఐదుగురు ఆమెపై సామూహిక అత్యాచారినికి ఒడిగట్టారు. దీంతో బాధితురాలు భూబన్‌ పోలీసులను ఆశ్రయించింది. తనపై జరిగిన దారుణాన్ని వివరిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. దీనిపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. మరో ముగ్గురి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. 

Manipur Violence: " ప్రధాని మోడీ తప్పించుకోలేరు.. ఆ 5 ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిందే .."

ఈ విషయాలను స్థానిక ఎస్పీ మంగళవారం మీడియాకు వివరించారు. తమ ప్రాథమిక దర్యాప్తులో బాధితురాలిపై అత్యాచారం జరిగినట్టు రుజువు అయ్యిందని చెప్పారు. అయితే వైద్య పరీక్షల కోసం బాధితురాలిని హాస్పిటల్ కు పంపించామని తెలిపారు. ఆ రిపోర్టులను బట్టి నిందితులపై మరిన్ని సెక్షన్ల కింద కేసు బుక్ చేస్తామని పేర్కొన్నారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios