Asianet News TeluguAsianet News Telugu

బూస్ట‌ర్ డోస్‌గా కోవిషీల్డ్ వేసుకోవ‌చ్చు.. అనుమ‌తిచ్చిన డీసీజీఐ

క‌రోనా మ‌ళ్లీ విజృంభించకుండా ఉండేందుకు ప్ర‌భుత్వం అన్ని చ‌ర్య‌లు తీసుకుంటోంది. అందులో భాగంగా కోవిషీల్డ్‌ను బూస్ట‌ర్ డోస్‌గా తీసుకునేందుకు ఈరోజు డీసీజీఐ అనుమ‌తి ఇచ్చింది. 

Covshield can be taken as a booster dose .. DCGI approved
Author
Hyderabad, First Published Dec 2, 2021, 1:39 PM IST

క‌రోనా కొత్త వేరియంట్ నేప‌థ్యంలో ప్ర‌పంచ దేశాల‌న్నీ భ‌యాందోళ‌న‌కు గుర‌వుతున్నాయి. ద‌క్షిణాఫ్రికాలో ఈ ఒమ్రికాన్ వేరియంట్ వెలుగులోకి వ‌చ్చింది. ఈ కొత్త వేరియంట్ విష‌యంలో జాగ్ర‌త్త‌గా ఉండాలని డ‌బ్ల్యూహెచ్‌వో కూడా హెచ్చ‌రించింది. ఈ నేప‌థ్యంలో దీనిని ఎదుర్కొవడానికి అన్ని దేశాలు సిద్ధ‌మ‌వుతున్నాయి. ప‌లు దేశాల్లో ఇప్ప‌టికీ అందుబాటులో ఉన్న క‌రోనా వ్యాక్సిన్ డోసులు ఇచ్చేశారు. కొన్ని దేశాలు త‌మ పౌరులకు రెండు డోసులు కూడా ఇప్ప‌టికే ఇచ్చేశాయి. 
ఒమ్రికాన్ విస్త‌రణ వ‌ల్ల ఆయా దేశాలు త‌మ పౌరుల‌కు క‌రోనా వ్యాక్సిన్ బూస్ట‌ర్ డోస్‌ ఇవ్వాల‌ని భావిస్తున్నాయి. భార‌త ప్ర‌భుత్వం కూడా బూస్ట‌ర్ డోస్ ఇవ్వాల‌నే ఆలోచ‌న‌లో ఉంది. అందులో భాగంగా ఇప్ప‌టికే అస్ట్రాజెనికా వ్యాక్సిన్ ను బూస్ట‌ర్ డోస్‌గా ఇచ్చేందుకు డీసీజీఐ అనుమ‌తిచ్చింది. కోవిషీల్డ్ వ్యాక్సిన్ ను కూడా బూస్ట‌ర్ డోస్‌గా ఇవ్వ‌వ‌చ్చ‌ని ఈరోజు డీసీజీఐ అనుమ‌తిచ్చింది. కోవిషీల్డ్‌ను బూస్ట‌ర్ డోస్‌గా ఇచ్చేందుకు అనుమ‌తి ఇవ్వాల‌ని సీర‌మ్ సంస్థ చేసుకున్న చేసుకున్న ద‌ర‌ఖాస్తుకు డీసీజీఐ ఆమోదం తెలిపింది. 

ఢిల్లీ హైకోర్డు వ్యాఖ్య‌ల నేప‌థ్యంలో..
కొత్త వేరియంట్ విస్త‌రిస్తుంద‌న్న వార్త‌ల నేప‌థ్యంలో ఢిల్లీ హైకోర్డు కీల‌క వాఖ్య‌లు చేసింది. దేశ పౌరుల‌కు బూస్ట‌ర్ డోస్ ఇచ్చే విష‌యంలో ప్ర‌భుత్వ వైఖ‌రి ఏంటో తెలియ‌జేయాల‌ని ఆదేశించింది. ఇప్ప‌టికే రెండు వేవ్‌లు భార‌త్‌ను ఇబ్బంది పెట్టాయ‌ని, మ‌రో సారి అలా జ‌ర‌కుండా చూసుకోవాల్సిన బాధ్య‌త ప్ర‌భుత్వంపై ఉంద‌ని తెలిపింది. ఈ నేప‌థ్యంలో కేంద్ర ప్ర‌భుత్వం ముంద‌స్తు చ‌ర్య‌గా బూస్ట‌ర్ డోస్‌కు అనుమ‌తి ఇచ్చింది. 

https://telugu.asianetnews.com/international/omicron-fear-crossing-countries-very-fast-first-case-reported-in-us-r3h4fv

సీర‌మ్ ఏం చెప్పిందంటే,..?
దేశంలో ఇప్ప‌టికే వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ కొన‌సాగుతోంది. ఈ బూస్ట‌ర్ డోస్ ఇవ్వ‌డం వ‌ల్ల ప్ర‌జ‌ల్లో ఇమ్యూనిటీ ప‌వ‌ర్ పెరుగుతుంద‌ని, దీంతో కొత్త వేరియంట్‌ను త‌ట్టుకునే శ‌క్తి వ‌స్తుంద‌ని తెలిపింది. త‌మ వ‌ద్ద బూస్ట‌ర్ డోస్ ఇచ్చేందుకు స‌రిప‌డా నిల్వ‌లు ఉన్నాయ‌ని చెప్పింది. త‌మ వ్యాక్సిన్ వేసుకోవ‌డం వ‌ల్ల తీవ్ర ల‌క్ష‌ణాల‌ను కూడా ఎదుర్కొనే శ‌క్తి వ‌స్తుంద‌ని తెలిపింది. వివిధ దేశాలు ఇప్ప‌టికే బూస్ట‌ర్ డోస్ ఇస్తున్న‌ట్టు డీసీజీఐకు చేసుకున్న ద‌ర‌ఖాస్తులో తెలిపింది. 
బూస్ట‌ర్ డోస్‌లు ఇవ్వాల‌ని ఇప్ప‌టికే ప‌లు రాష్ట్రాలు కూడా కేంద్ర ప్ర‌భుత్వానికి విన‌తులు అంద‌జేశాయి. కేర‌ళ‌, రాజ‌స్థాన్‌, క‌ర్నాట‌క‌, త‌మిళ‌నాడు రాష్ట్రాలు త‌మ ప్ర‌జ‌లకు బూస్ట‌ర్ డోస్ ఇవ్వాల‌ని విన్న‌వించాయి.  దీనిపై కేంద్ర సానుకూలంగా స్పందించాల‌ని కోరాయి. బూస్ట‌ర్ డోస్ ఎలా ప‌నిచేస్తుందో అనే విష‌యం  తెలుసుకునేందుకు శాస్త్రీయంగా అధ్య‌య‌నం జ‌రుగుతోంద‌ని, దాని ఫ‌లితాలు వ‌చ్చాక నిర్ణ‌యం తీసుకుంటామ‌ని కేంద్రం ఇటీవ‌ల పార్ల‌మెంట్‌కు నివేదించింది. 
అయితే కొత్త వేరియంట్ ఇండియాలోకి వ‌చ్చిందా లేదా అనే విష‌యంలో ఇప్ప‌టికీ క‌చ్చిత‌మైన స‌మాచారం లేదు. కాక‌పోతే ఈ సారి కేంద్ర ప్ర‌భుత్వం ముందుగానే అలెర్ట్ అయ్యింది. ఇటీవ‌ల ఇదే విష‌యంలో ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ ఆయా రాష్ట్రాల అధికారులు, మంత్రుల‌తో వీడియో కాన్ఫిరెన్స్ నిర్వ‌హించారు. ఒమ్రికాన్ నేప‌థ్యంలో అన్ని రాష్ట్ర ప్ర‌భుత్వాలు అలెర్ట్‌గా ఉండాల‌ని సూచించారు. ఒక వేళ కొత్త వేరియంట్ ప్ర‌వేశిస్తే దానిని ఎదుర్కొవ‌డానికి సిద్ధంగా ఉండాలని తెలిపారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios