Asianet News TeluguAsianet News Telugu

Omicron: ఒమిక్రాన్ టెన్షన్.. అమెరికాలో తొలి కేసు.. 26 దేశాలకు పాకిన కొత్త వేరియంట్..

దక్షిణాఫ్రికాలో తొలుత గుర్తించిన కోవిడ్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ (Omicron) అత్యంత వేగంగా ఇతర దేశాలకు చేరుతోంది. ఇప్పటివరకు 26 దేశాల్లో ఈ వేరియంట్ కేసులు గుర్తించారు. 

Omicron Fear Crossing countries very fast first case reported in US
Author
Hyderabad, First Published Dec 2, 2021, 11:25 AM IST

దక్షిణాఫ్రికాలో తొలుత గుర్తించిన కోవిడ్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ (Omicron) అత్యంత వేగంగా ఇతర దేశాలకు చేరుతోంది. ఇప్పటివరకు 26 దేశాలలో ఒమిక్రాన్ కేసులు గుర్తించబడటం ఆందోళనకు గురిచేస్తుంది. అగ్ర రాజ్యం అమెరికాలో (US) కూడా ఒమిక్రాన్ వేరియంట్ తొలి కేసు నమోదైంది. తొలుత ఈ వేరియంట్ వెలుగులోకి రావడంతోనే ప్రపంచ దేశాలు అప్రమత్తమయ్యాయి. పలు దేశాలు వెంటనే అంతర్జాతీయ ప్రయాణాలపనై ఆంక్షలు విధించాయి. దక్షిణాఫ్రికాతో పాటు ఈ వేరియంట్ గుర్తించన దేశాలకు ప్రయాణాలపై నిషేధం విధించాయి. 

అయినప్పటికీ ఈ కొత్త వేరియంట్‌‌ విస్తరించకుండా (Omicron Widens_ ఆపడం కష్టమే అనే సంకేతాలను కనిపిస్తున్నాయి. దేశాల మధ్య ప్రయాణిస్తున్న వ్యక్తులు, వారి కాంటాక్ట్స్ నుంచి ఈ వేరియంట్లు ఇప్పటికే సరిహద్దులు దాటి ప్రయాణించినట్టుగా తెలుస్తోంది. మరికొన్ని దేశాలకు కూడా ఈ వేరియంట్ విస్తరించిందని.. కొద్ది రోజుల్లోనే కేసులు వెలుగుచూస్తాయని నిపుణులు చెబుతున్నారు. 

Also read: Omicron Symptoms: ఒమిక్రాన్ వేరియంట్ లక్షణాలు ఇవే.. ఆ ఏజ్ గ్రూప్‌ మీద ఎక్కువగా ప్రభావం..!

ఇక, అమెరికాలో నమోదైన కేసు విషయానికి వస్తే.. దక్షిణాఫ్రికా నుంచి ఇటీవలే తిరిగి వచ్చిన వ్యక్తిలో ఒమిక్రాన్ వేరియంట్‌ను గుర్తించినట్టుగా సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న శాస్త్రవేత్తలు, పరిశోధకులు కొత్త వేరియంట్.. పూర్తి ప్రభావాన్ని అర్థం చేసుకోవడానికి, అంచనా వేయడానికి వేగంగా అడుగులువేస్తున్నారు.

మరి ఇప్పటివరకు ఒమిక్రాన్ వేరియంట్ ఏ దేశాల్లో విస్తరించిందో చూద్దాం.. 
దక్షిణాఫ్రికా:
జోహన్నెస్‌బర్గ్‌ ఉన్న ప్రావిన్స్‌లో మీడ్ వీక్‌లో నమోదైన 1,100 కొత్త కేసుల్లో 90 శాతం ఈ వేరియంట్ వల్ల సంభవించాయని ప్రాథమిక PCR పరీక్ష నమూనాలు చూపించాయి. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ కమ్యూనికేబుల్ డిసీజెస్ ప్రకారం.. రోజువారి కేసుల సంఖ్య రెట్టింపు అయింది.

బోట్స్వానా: ఇప్పటివరకు దక్షిణాఫ్రికా తర్వాత ఇక్కడే ఎక్కువ కేసులు ఉన్నాయి. కనీసం 19 కేసులు వెలుగుచూశాయి.

యూకే: ఇక్కడ కొద్ది రోజుల కింద దక్షిణాఫ్రికాతో లింక్ ఉన్న మూడు కేసులు వెలుగుచూశాయి. అయితే తాజాగా మరో రెండు కేసులు కూడా నమోదు కావడంతో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 5కి చేరింది.

జర్మనీ: దక్షిణాఫ్రికా నుంచి మ్యూనిచ్ విమానాశ్రయానికి వచ్చిన ప్రయాణికుల్లోని ఇద్దరిలో ఈ వేరియంట్‌ను గుర్తించినట్టుగా ప్రాంతీయ అధికారులు వెల్లడించారు.

నెదర్లాండ్స్: దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన ప్రయాణికులలో 13 కేసులు కనుగొన్నారు. 

డెన్మార్క్: దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన వారిలో రెండు కేసులు

బెల్జియం: ఇప్పటివరకు ఇక్కడ ఒక్క కేసు నమోదైంది.

Also read: Omicron: దక్షిణాఫ్రికా శాస్త్రవేత్తలు ఒమిక్రాన్‌ను ఎలా గుర్తించారు?.. వారు ఎందుకు భయాందోళన చెందారు..?

ఇజ్రాయెల్: నవంబర్ 27 నాటికి ఇక్కడ ఒక్క కేసు ధ్రువీకరించబడింది. అయితే అనుమానితుల సంఖ్య కూడా భారీగానే ఉంది. 

ఇటలీ: ఇక్కడ ఒక కేసు నమోదైంది. అయితే ఒమిక్రాన్ నిర్ధారణ అయిన వ్యక్తి.. అంతకు ముందు దేశంలోని పలు ప్రాంతాల్లో పర్యటించడం అధికారులను కలవరపెడుతుంది. 

చెక్ రిపబ్లిక్: ఇప్పటివరకు ఇక్కడ ఒక కేసు నమోదైనట్టుగా స్థానిక తెలిపింది.

ఆస్ట్రియా: దక్షిణాఫ్రికా నుండి వచ్చిన వ్యక్తుల్లో ఒకరికి ఒమిక్రాన్ పాజిటివ్ అని తేలింది. మరో 30 అనుమానిత కేసులను అధికారులు సమీక్షిస్తున్నారు

స్విట్జర్లాండ్: మూడు కేసులను ఇక్కడ గుర్తించారు. ప్రభావిత దేశాల నుంచి వచ్చిన విదేశీ ప్రయాణికులను ఐసోలేషన్‌లో ఉన్నారు

ఫ్రాన్స్: ప్రభుత్వ ప్రతినిధి ప్రకారం.. పదమూడు అనుమానిత కేసులు ఉన్నాయి.

పోర్చుగల్: 13 కేసుల ప్రాథమిక పరీక్షలు అవన్నీ ఓమిక్రాన్ వేరియంట్‌కు సంబంధించినవని బలంగా సూచిస్తున్నాయి. ఈ కేసుల్లో ఒకటి ఇటీవల దక్షిణాఫ్రికా పర్యటనకు వచ్చిన వ్యక్తికి సంబంధించినది.

స్పెయిన్: మాడ్రిడ్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం.. ఇక్కడ ఒక కేసు నమోదైంది.

స్వీడన్: దేశ పబ్లిక్ హెల్త్ ఏజెన్సీ ప్రకారం.. ఇక్కడ ఇప్పటివరకు ఒక కేసు నమోదైంది.

హాంకాంగ్ SAR: ఇక్కడ నాలుగు కేసులు నిర్ధారించబడ్డాయి. వాటిలో రెండు కేసులు దక్షిణాఫ్రికాకు సంబంధించినవి, మిగిలినవి నైజీరియాకు సంబంధించినవి.

ఆస్ట్రేలియా: ఆరోగ్య శాఖ అధికారుల గణంకాల ప్రకారం.. న్యూ సౌత్ వేల్స్ రాష్ట్రంలో ఆరు కేసులు వెలుగుచూశాయి. అందులో ఓ వ్యక్తి పూర్తిగా వ్యాక్సినేషన్ వేయించుకున్నాడు. అయితే అతను ఇటీవల దక్షిణాఫ్రికాను సందర్శించాడు

జపాన్: రెండు కేసులు. నమీబియా నుండి తిరిగి వచ్చిన ఒక వ్యక్తిలో ఒమిక్రాన్‌ను గుర్తించారు. పెరూ నుంచి వచ్చిన వ్యక్తిలో కూడా ఒమిక్రాన్ పాజిటివ్‌గా తేలింది. 

కెనడా:  ఇక్కడ మొత్తం 5 కేసులు నమోదైనట్టుగా ఒట్టావా పబ్లిక్ హెల్త్‌ను ఉటంకిస్తూ రాయిటర్స్ పేర్కొంది.

బ్రెజిల్: రెండు కేసులు. ఇటీవల దక్షిణాఫ్రికా నుండి వచ్చిన భార్యభర్తలకు ఒమిక్రాన్ పాజిటివ్ అని నిర్దారణ అయింది.

నార్వే: ఓయ్‌గార్డెన్ మునిసిపాలిటీలో రెండు కేసులు నిర్ధారించబడ్డాయి. ఇద్దరు వ్యక్తులు దక్షిణాఫ్రికాలో ప్రయాణించారు

ఐర్లాండ్: ఇక్కడ ఒక్క కేసు నిర్దారించబడింది.

అమెరికా: దక్షిణాఫ్రికా నుండి తిరిగి వచ్చిన వ్యక్తికి ఒమిక్రాన్ నిర్దారణ అయింది. అయితే కాలిఫోర్నియాకు చెందిన ఆ వ్యక్తికి ఇదివరకే పూర్తిగా టీకాలు వేసుకున్నారు. 

దక్షిణ కొరియా: నైజీరియా నుండి తిరిగి వచ్చిన జంటకు, వారి కాంటాక్ట్స్‌తో సహా ఐదు కేసులు నిర్ధారించబడ్డాయి

యూఏఈ: ఒక కేసు నిర్ధారించబడింది

సౌదీ అరేబియా: ఒక కేసు నిర్ధారించబడింది

Follow Us:
Download App:
  • android
  • ios