కేంద్రం విజ్ఞప్తి... వెనక్కి తగ్గిన సీరం: రాష్ట్రాలకు రూ.300కే కోవిషీల్డ్
రాష్ట్రాలకు గుడ్‌న్యూస్ చెప్పారు సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్ఐఐ) అధినేత అధర్ పూనావాలా. రాష్ట్ర ప్రభుత్వాలకు సరఫరా చేయబోయే కోవిషీల్డ్ ధరలను తగ్గించడానికి అంగీకరించింది.. రాష్ట్రాలకు డోసును రూ.300కే అందిస్తామని ప్రకటించింది
రాష్ట్రాలకు గుడ్‌న్యూస్ చెప్పారు సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్ఐఐ) అధినేత అధర్ పూనావాలా. రాష్ట్ర ప్రభుత్వాలకు సరఫరా చేయబోయే కోవిషీల్డ్ ధరలను తగ్గించడానికి అంగీకరించింది.. రాష్ట్రాలకు డోసును రూ.300కే అందిస్తామని ప్రకటించింది.
మొదట్లో డోసును రాష్ట్ర ప్రభుత్వాలకు రూ.400కు ప్రైవేట్ ఆస్పత్రులకు అయితే రూ.600కు ఇస్తామని ప్రకటించింది సీరం. కానీ, ఈ నిర్ణయంతో కేంద్ర ప్రభుత్వంపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి.
దీంతో వ్యాక్సిన్ ధరలు తగ్గించాలంటూ.. సీరంతో పాటు కొవాగ్జిన్‌ను తయారు చేస్తున్న భారత్ బయోటెక్‌ను కూడా కోరింది కేంద్రం. దీంతో రాష్ట్రాలకు కోవిషీల్డ్ ధరను 25 శాతం మేర తగ్గించి రూ.300కే ఒక డోసును ఇస్తున్నట్లు అధర్ పూనావాలా ట్వీట్ చేశారు.
Also Read:టీకా రిజిస్ట్రేషన్ కోసం ఎగబడ్డ జనం: క్రాష్ అయిన కోవిన్ యాప్.. కేంద్రంపై విమర్శలు
భారత్ బయోటెక్ లిమిటెడ్ యొక్క కోవాగ్జిన్‌ను రాష్ట్ర ప్రభుత్వాలకు డోసు 600 రూపాయలు , ప్రైవేట్ ఆసుపత్రులకు 1,200 రూపాయలుగా నిర్ణయించింది. ఏదేమైనా, రెండు టీకాలను కేంద్రం మాత్రం 150 రూపాయలకే సేకరించింది.
కానీ, బాధ్యతను రాష్ట్రాలకు అప్పగించే సమయానికి మాత్రం వ్యాక్సిన్ ధరలు పెంచారంటూ ప్రధాని మోడీ విమర్శలు ఎదుర్కొన్నారు. ఈ ధరలపై రాష్ట్ర ప్రభుత్వాలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తూనే ఉన్నాయి.
కరోనా మహమ్మారి నుంచి కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరూ మాస్కులు తప్పకుండా ధరించాలని, శానిటైజ్ చేసుకోవాలని, సామాజిక దూరం పాటించాలని ఏషియానెట్ విజ్ఢప్తి చేస్తోంది. సాధ్యమైనంత త్వరగా కరోనా టీకా తీసుకోవాలని కూడా కోరుతోంది. అందరం కలిసి కరోనా వ్యాప్తిని అరికడుదాం, మనల్ని మనం రక్షించుకుందాం. #ANCares #IndiaFightsCorona