Asianet News TeluguAsianet News Telugu

భారత్ లో కరోనా వైరస్ డేంజర్ రిమైండర్... డబ్ల్యూహెచ్ఓ

భారత్ లో రోజు రోజుకీ పెరుగుతున్న కరోనా కేసుల విషయంలో తమ ప్రపంచ ఆరోగ్య సంస్థ తీవ్ర ఆందోళన చెందుతోందని ఆయన పేర్కొన్నారు. 

COVID19 situation in India a 'devastating reminder' of what virus can do: WHO Chief Tedros Adhanom Ghebreyesus
Author
Hyderabad, First Published Apr 24, 2021, 10:58 AM IST

భారత్ లో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజు రోజుకీ కరోనా కేసులు పెరిగిపోతున్నాయి.  ఈ సెకండ్ వేవ్ లో కరోనా మరణాలు కూడా ఎక్కువగానే నమోదౌతున్నాయి. కాగా.. భారత్ లో కరోనా వైరస్ పరిస్థితి పై డబ్ల్యూహెచ్ఓ చీఫ్ టెడ్రూస్ అథనామ్ స్పందించారు. భారత్ లో కరోనా ఒక వినాశకరమైన డేంజర్ రిమైండర్ గా ఆయన అభివర్ణించారు. ఒక వైరస్ ఏం చేయగలదో దీని ద్వారా అందరికీ తెలిసిందని ఆయన పేర్కొన్నారు.

భారత్ లో రోజు రోజుకీ పెరుగుతున్న కరోనా కేసుల విషయంలో తమ ప్రపంచ ఆరోగ్య సంస్థ తీవ్ర ఆందోళన చెందుతోందని ఆయన పేర్కొన్నారు. 

‘‘ పరిస్థితి ఆందోళనకరంగా ఉందని మాకు తెలుసు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో వేర్వేరు రెస్పాండ్ అవ్వాల్సిన పరిస్థిత ఉంది. సమాజిక దూరం తగ్గించడానికి.. వ్యాక్సిన్ ఉత్పత్తి పెంచడానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను స్వాగతిస్తున్నాం’’ అని ఆయన పేర్కొన్నారు.

 

డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ మాట్లాడుతూ... భారత్ లో చాలా మంది తమకు కావాల్సిన వ్యక్తులను కరోనా కారణంగా కోల్పోయారు. వారికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లు  చెప్పారు.  ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ కరోనా విషయంలో భారత ప్రభుత్వానికి ప్రజలకు అండగా ఉంటుందని.. తమకు సాధ్యమైనంత సహాయం చేస్తామని ఆయన పేర్కొన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios