Asianet News TeluguAsianet News Telugu

మద్యం ప్రియులకు శుభవార్త: నేటి నుండి బార్లు ఓపెన్

మద్యం ప్రియులకు శుభవార్తే.  లాక్ డౌన్ నిబంధనల సడలింపులో భాగంగా బార్లను తెరుచుకొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. బుధవారం నుండి రాష్ట్ర వ్యాప్తంగా బార్లు తెరుచుకోనున్నాయి. 

Covid19 Bars to open in Rajasthan from today
Author
New Delhi, First Published Jun 24, 2020, 11:02 AM IST

జైపూర్:  మద్యం ప్రియులకు శుభవార్తే.  లాక్ డౌన్ నిబంధనల సడలింపులో భాగంగా బార్లను తెరుచుకొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. బుధవారం నుండి రాష్ట్ర వ్యాప్తంగా బార్లు తెరుచుకోనున్నాయి. 

ఐదో విడత లాక్ డౌన్ లో భాగంగా ఆంక్షల సడలింపును ఈ నెల 8వ తేదీ నుండి ప్రారంభించింది కేంద్రం.అయితే  హోటల్స్, రెస్టారెంట్లు, మద్యం దుకాణాలు తెరిచినప్పటికీ కూడ బార్లను మాత్రం తెరవలేదు. బార్లను ఇవాళ్టి నుండి తెరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. 

also read:కరోనా ఎఫెక్ట్: గంటలపాటు రోడ్డుపైనే శవం, చివరికి...

సామాజిక దూరం పాటించడం, శానిటైజేషన్‌ ప్రక్రియ చేపట్టడం వంటి నిబంధనలతో బార్లకు అనుమతులు ఇచ్చింది. రాత్రి 9 గంటల నుండి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ అమల్లో ఉంటుంది. కరోనా కంటే ముందు ఉన్నట్టుగా బార్లను తెరిచే అవకాశం లేదు. 

తక్కువ సమయంలోనే తగినంత ఆదాయాన్ని పొందడానికి యజమానులు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. కాగా.. మాల్స్‌, రెస్టారెంట్లు మొదలైన వాటికి ప్రభుత్వం అనుమతులు ఇచ్చినా కరోనా వైరస్‌ ప్రమాదం దృష్ట్యా ప్రజలు బయటకు రావడానికి ఆసక్తి చూపకపోవడం గమనార్హం.

Follow Us:
Download App:
  • android
  • ios