Asianet News TeluguAsianet News Telugu

కరోనా ఎఫెక్ట్: గంటలపాటు రోడ్డుపైనే శవం, చివరికి....

కరోనా భయంతో గంటల తరబడి రోడ్డుపైనే ఓ వృద్ధుడి శవం ఉన్నా కూడ ఎవరూ కూడ పట్టించుకోలేదు. పోలీసులే ఆ శవాన్ని అంత్యక్రియల కోసం తీసుకెళ్లారు.      ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలోని చెన్నైలో చోటు చేసుకొంది.

Mans body lay on road for hours; corpse carried in cycle rickshaw in absence of ambulance
Author
Chennai, First Published Jun 23, 2020, 6:32 PM IST

చెన్నై: కరోనా భయంతో గంటల తరబడి రోడ్డుపైనే ఓ వృద్ధుడి శవం ఉన్నా కూడ ఎవరూ కూడ పట్టించుకోలేదు. పోలీసులే ఆ శవాన్ని అంత్యక్రియల కోసం తీసుకెళ్లారు.      ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలోని చెన్నైలో చోటు చేసుకొంది.
              
చెన్నైకి చెందిన ఓ వృద్ధుడు ఉండటానికి నివాసం లేకపోవడంతో రాజీవ్‌గాంధీ ప్రభుత్వ ఆస్పత్రికి సమీపంలో గల ఈవీఆర్‌ పెరియార్‌ సలై రోడ్డు పుట్‌పాత్‌పై భిక్షాటన చేస్తూ జీవిస్తున్నాడు. 

అనారోగ్యంతో ఆయన సోమవారం మృతి చెందాడు. అయితే కరోనా వైరస్‌ భయంతో స్థానికులు ఎవరూ మృతదేహాన్ని ఎవరూ కూడ ముట్టుకోలేదు. పోలీసులకి సమాచారం అందడంతో ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని తరలించారు. 

అంబులెన్స్‌ అందుబాటులో లేకపోవడంతో రిక్షాలో మృతదేహాన్ని తరలించామని పోలీసులు తెలిపారు. కాగా, దాదాపు 4 గంటల పాటు మృతదేహం రోడ్డుపైనే ఉందని స్థానికులు చెబుతున్నారు.

ఇలాంటి ఘటనే మరొకటి ఈ నెల 12న మహారాష్ట్రలోని జల్గావ్‌ ప్రభుత్వ ఆస్పత్రిలో చోటు చేసుకుంది. కరోనా బారిన పడి చికిత్స పొందుతున్న ఓ వృద్ధ మహిళ.. ప్రమాదవశాత్తు బాత్రూంలో పడి మృతి చెందింది. దాదాపు నాలుగు రోజుల తర్వాత మృతదేహాన్ని టాయిలెట్‌లో నుంచి బయటకు తీశారు. 

ఆస్పత్రిలోని రోగులంతా మృతదేహాన్ని చూసినప్పటికీ ఎవరూ పట్టించుకోలేదు. చివరకి దుర్వాసన భరించలేక కరోనా పేషెంట్లు ఆస్పత్రి సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో మృతదేహాన్ని అక్కడి నుంచి తరలించారు.


 

Follow Us:
Download App:
  • android
  • ios